కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటాం
eenadu telugu news
Published : 15/10/2021 05:54 IST

కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటాం

తుమ్మలపల్లిలో తెరాస కార్యకర్త కుటుంబానికి ఆర్ధిక సాయం అందజేస్తున్న ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత, రైబస కోఆర్డినేటర్‌ రవీందర్‌రెడ్డి

నాంపల్లి: తెరాస కార్యకర్తల కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటామని ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత, రైబస మండల సమన్వయకర్త ఏడుదొడ్ల రవీందర్‌రెడ్డి అన్నారు. మండలపరిధిలోని తుమ్మలపల్లిలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన తెరాస కార్యకర్త వాదాసు సాయిలమ్మ, తిర్మలగిరికి చెందిన ఎలిజాల జంగయ్య కుటుంబాలను గురువారం పరామర్శించి, ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున ఆర్ధిక సాయం అందజేశారు. తెరాస మండల అధ్యక్షుడు గుమ్మడపు నర్సింహారావు, సర్పంచి కొలుకులపల్లి చెన్నయ్య, గుమ్మడపు రామేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యురాలు అన్నెపాక సరిత, ఎండీ.సలీం, రాములు, లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని