అనాథ బాలికలకు కంటి పరీక్షలు
eenadu telugu news
Published : 15/10/2021 05:54 IST

అనాథ బాలికలకు కంటి పరీక్షలు

నల్గొండ అర్బన్‌, న్యూస్‌టుడే: ప్రపంచ దృష్టి దినోత్సవం పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని గంధవారిగూడెం ప్రాంతంలో ఉన్న అనాథ బాలికలకు ఐఎంఏ నీలగిరి బ్రాంచి ఆధ్వర్యంలో గురువారం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఐఎంఏ నీలగిరి శాఖ కార్యదర్శి అనితారాణి మాట్లాడుతూ అనాథ బాలికలకు చేయూతనివ్వడంలో సంతృప్తి ఉంటుందన్నారు. అవసరం ఉన్న బాలికలకు ఉచిత పరీక్షలతో పాటు కళ్లజోళ్లు, మందులు అందించినట్లు తెలిపారు. ఐఎంఏ నాయకులు ఏసీహెచ్‌ పుల్లారావు, ప్రత్యూష, జయప్రకాష్‌రెడ్డి, మేరి తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని