మహిషాసుర మర్ధినిగా అమ్మవారు
eenadu telugu news
Published : 15/10/2021 05:54 IST

మహిషాసుర మర్ధినిగా అమ్మవారు

చిట్యాలలో రథోత్సవాన్ని ప్రారంభిస్తున్న పుర ఛైర్మన్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

చిట్యాల: దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చిట్యాల కనకదుర్గ ఆలయంలో అమ్మవారు గురువారం భక్తులకు మహిషాసురమర్థినిగా దర్శనమిచ్చారు. అనంతరం నిర్వహించిన అమ్మవారి రథయాత్రను పురఛైర్మన్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు వేలుపల్లి మధుకుమార్‌, మేనేజర్‌ అంబటి నాగిరెడ్డి, పుర వైస్‌ ఛైర్మన్‌ కూరెళ్ల లింగస్వామి, పీఏసీఎస్‌ వైస్‌ఛైర్మన్‌ మెండె సైదులు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని