అమ్మవారి ఊరేగింపులో భక్తులు
eenadu telugu news
Published : 15/10/2021 05:54 IST

అమ్మవారి ఊరేగింపులో భక్తులు

నీలగిరి కల్చరల్‌: దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం మహిషాసుర మర్ధిని అలంకారంలో అమ్మవారు పూజలందుకున్నారు. అభిషేకాలు, అర్చనలు పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు అన్నదానం చేశారు.

చక్రస్నానం ఊరేగింపు.. రామగిరిలోని కనకదుర్గ ఆలయంలో ఉత్సవాల సందర్భంగా చక్రస్నానం ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి చక్రస్నానం ఊరేగింపు సందర్భంగా కోలాటం భజనలు, భాజాభజంత్రీలు ఆటపాటలతో నిర్వహించారు. పానగల్‌ ఉదయం సముద్రంలో అమ్మవారి చక్రస్నానం నిర్వహించి ఆలయానికి చేర్చారు. రాజు, రవి, రాము, విజయ్‌, నాగరాజు, విశాల్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని