చిత్తు చిత్తుల బొమ్మ.. శివుని ముద్దుల గుమ్మ
eenadu telugu news
Published : 15/10/2021 05:54 IST

చిత్తు చిత్తుల బొమ్మ.. శివుని ముద్దుల గుమ్మ

 

మర్రిగూడలో..

మర్రిగూడ, కట్టంగూరు, కేతేపల్లి, నకిరేకల్‌ శాలిగౌరారం, చండూరు-న్యూస్‌టుడే: జిల్లాలోని వివిధ మండలాల్లో గురువారం సద్దుల బతుకమ్మ పండగ సంబరాలు నిర్వహించారు. మర్రిగూడలోని దుర్గామాత, వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాలలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక సర్పంచి నల్ల యాదయ్యగౌడ్‌, ఎంపీటీసీ సభ్యుడు కట్కూరి వెంకటేశ్‌ ఏర్పాట్లను పరిశీలించారు.

చండూరు మండలంలో భక్తిశ్రద్ధలతో వేడుకను వైభవంగా జరుపుకున్నారు. చండూరు పురపాలికలో ఛైర్‌ పర్సన్‌ తోకల చంద్రకళ, కౌన్సిలర్లు, గ్రామ పంచాయతీల్లో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కట్టంగూరు, కురుమర్తి, పెద్దోనిబాయి, మునుకుంట్ల, కల్మెర, పామనగుండ్ల, అయిటిపాముల, చెర్వుఅన్నారం, యర్సానిగూడెంలో మహిళలు గురువారం పండగ ఘనంగా జరుపుకున్నారు. సాయంత్రం ప్రధాన కూడళ్ల వద్దకు బతుకమ్మలతో చేరి ఆడిపాడారు. కేతేపల్లి మండలంలో సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. చీకటిగూడెంలో జిల్లా పరిషత్‌ డిప్యూటీ సీఈవో కాంతమ్మ, సర్పంచి కోట వెంకటేశ్వర్‌రావు బహుమతులు ప్రదానం చేశారు. నకిరేకల్‌లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, టీపీసీసీ కార్యనిర్వాహక కార్యదర్శి దైద రవీందర్‌, ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవి, జడ్పీటీసీ సభ్యురాలు మాద ధనలక్ష్మి, పుర ఛైర్మన్‌ రాచకొండ శ్రీనివాస్‌, వైస్‌ ఛైర్‌పర్సన్‌ మురారిశెట్టి ఉమారాణి, మార్కెట్‌ ఛైర్‌పర్సన్‌ నడికుడి ఉమారాణి, తెఇపా నాయకురాలు చెర్కు లక్ష్మి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. శాలిగౌరారం మండలంలో ఘనంగా పండగ నిర్వహించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని