ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించండి
eenadu telugu news
Published : 15/10/2021 05:54 IST

ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించండి

ఆర్జాలబావిలో రైతులతో మాట్లాడుతున్న కిసాన్‌మోర్చా జాతీయ నాయకుడు గోలి మధుసూదన్‌రెడ్డి

నల్గొండ గ్రామీణం, నీలగిరి, న్యూస్‌టుడే: వరికోతలు ప్రారంభమైనా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని కిసాన్‌మోర్చా జాతీయ నాయకుడు గోలి మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం నల్గొండ పట్టణం పరిధిలోని ఆర్జాలబావి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతులు పంట కోసి ధాన్యం చేరవేస్తున్నా అధికారులు కొనుగోలుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని కోరారు. నాయకులు దాసోజు యాదగిరాచారి, కంచర్ల విద్యాసాగర్‌రెడ్డి, పాదూరి వెంకట్‌రెడ్డి, బీపంగి జగ్జీవన్‌రావ్‌, బద్దం నగేష్‌, వెంకట్‌రెడ్డి, బిక్షంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చండూరు: ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బండ శ్రీశైలం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. చండూరులో గురువారం విలేకరులతో మాట్లాడారు. వర్షాలకు రంగు మారిన ధాన్యం, పత్తిని కూడా మద్దతు ధరకే కొనుగోలు చేయాలన్నారు. ఆయన వెంట సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చిన్నపాక లక్ష్మినారాయణ, సీపీఎం మండల కార్యదర్శి బొట్ట శివకుమార్‌, మొగుదాల వెంకటేశం, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని