చిత్రాలు వేయడంలో నేర్పరి
eenadu telugu news
Published : 15/10/2021 06:04 IST

చిత్రాలు వేయడంలో నేర్పరి

రూపాశ్రీ వొసేిన వివిధ చిత్రాలు

కట్టంగూరు, నకిరేకల్‌, న్యూస్‌టుడే: ఆ చిన్నారికి బాల్యం నుంచే చిత్రలేఖనంపై ఎనలేని ఆసక్తి. వయస్సు పెరుగుతున్నా కొద్దీ చదువులో రాణిస్తూనే తనకు కనిపించే దృశ్యాలను అలవోకగా గీస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈమెలోని ప్రతిభనుచూసి పలువురు మెచ్చుకుంటున్నారు. అవార్డులతో ప్రశంసలు పొందుతున్నారు. కట్టంగూరు మండలం పందెనపల్లికి చెందిన పులి రూపాశ్రీ.మండలంలోని పందెనపల్లికి చెందిన పులి పాపయ్య, సంధ్యారాణి దంపతుల కుమార్తె రూపాశ్రీ బాల్యం నుంచి కళాత్మకంగా చిత్రాలు గీస్తూ పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. ఆసక్తి, అభిరుచితో సొంతంగా నేర్చుకున్న కళను వృత్తిగా మార్చుకునేందుకు చిత్రకళా రంగంలో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సు (హైదరాబాద్‌)లో చేరారు. పల్లె పడుచుల చిత్రాలు అందంగా వేయడంలో అందెవేసిన చేయిగా పేరు తెచ్చుకున్నారు. రూపాశ్రీ. నకిరేకల్‌లోని ఏవీఎం విద్యాసంస్థలో ఒకటి నుంచి పదవ తరగతి వరకు చదువుకున్నారు. చదువులో ముందున్న ఆమె తనకు కనిపించిన దృశ్యాలను పెన్సిల్‌తో వేస్తూ స్నేహితులను ఆకట్టుకునేవారు. పాఠశాల స్థాయిలో పలు పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు. అనంతరం పాలిటెక్నిక్‌ (వ్యవసాయం కోర్సు) పూర్తి చేశారు. బొమ్మలు గీయడంలో నైపుణ్యం కలిగిఉన్నారు. తల్లిదండ్రుల సహకారంతో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ పైన్‌ ఆర్ట్స్‌ కోర్సు (హైదరాబాద్‌ లోని శ్రీవెంకటేశ్వర కళశాల)లో చేరారు. ప్రస్తుతం నాల్గో సంవత్సరం చదువుతున్నారు. వేసవి సెలవుల్లో టీటీసీ(ఆర్ట్‌ కోర్సు) పూర్తి చేశారు. ఈకోర్సులో వివిధ రకాలైన బొమ్మలు గీయడంలో సృజనాత్మకంగా ఆలోచించడం, మెలకువలు పొందినట్లు రూపాశ్రీ తెలిపారు. నిత్యం ప్రకృతి దృశ్యాలు, గ్రామీణ వాతావరణం, పండుగల నేపథ్యం చిత్రాలను అందంగా గీస్తున్నారు. 2014లో పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో నిర్వహించిన చిత్రలేఖన పోటీలలో పాల్గొని మంత్రి జగదీశ్‌రెడ్డి చేతుల మీదుగా రూపాశ్రీ ప్రథమ బహుమతి అందుకున్నారు.భవిష్యత్తులో చిత్రలేఖనంలో మరింతగా రాణిస్తానని చెప్పారామె.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని