కారు, ద్విచక్ర వాహనం ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు
eenadu telugu news
Published : 15/10/2021 06:04 IST

కారు, ద్విచక్ర వాహనం ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

కారును ఢీ కొట్టిన లారీ

కీసర, న్యూస్‌టుడే: లారీ కారును ఢీ కొట్టడంతో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గురువారం సాయంత్రం మేడ్చల్‌ జిల్లా కీసర అవుటర్‌ రింగు రోడ్డుపై జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండకు చెందిన సూరజ్‌రెడ్డి(38) శామీర్‌పేట నుంచి కీసర ఓఆర్‌ఆర్‌ మీదుగా దసరాకు సొంతూరుకు వెళ్తున్నారు. మూత్ర విసర్జనకు కీసర మండలం రాంపల్లిదాయర వద్ద దారి పక్కన కారు నిలిపారు. వెనకాల నుంచి అతి వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. దీంతో వాహనం లారీ ముందు భాగంలో ఇరుక్కుపోయింది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో ఇరుక్కు పోయిన సూరజ్‌రెడ్డిని అతి కష్టం మీద బయటకు తీశారు. ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతన్ని వెంటనే నగరంలోని ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. కీసర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని