close

బుధవారం, ఆగస్టు 12, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మృతదేహాల ఖననంపైవిచారణాధికారి నియామకం

మంత్రి అనిల్‌ ఆరా

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: జిల్లా కేంద్రమైన నెల్లూరులో కొవిడ్‌-19 మహమ్మారి బారిన పడి మృతి చెందిన వారి మృతదేహాలను పెన్నా తీరంలో ఖననం చేసిన ఘటనపై విచారణకు జేసీ ప్రభాకరరెడ్డి ఆదేశించారు. పెన్నా తీరంలో పొక్లెయినరుతో మృతదేహాలను తీసుకెళ్లి ఖననం చేయడంపై ‘ఈనాడు’లో ‘పెన్నాలో కొవిడ్‌ మృతుల ఖననం’ శీర్షికన శుక్రవారం కథనం ప్రచురితమైంది. దీనిపై జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ప్రభాకరరెడ్డి స్పందించి ఘటనపై విచారణాధికారిగా ఆర్డీవో హుస్సేన్‌సాహెబ్‌ను నియమించి విచారణ నివేదికను అందించాలని ఆదేశించారు.

మంత్రి ఆరా.. పెన్నా నదిలో కరోనా మృతదేహాలను పొక్లెయినరుతో పూడ్చడంపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ పి.అనిల్‌కుమార్‌ స్పందించారు. ఈఘటనపై ఆరా తీశారు. బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. వివరాలు పూర్తిగా తనకు తెలియజేయాలని సూచించారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.