close

బుధవారం, ఆగస్టు 12, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
82 కేసుల నమోదు

1,340కి చేరిన సంఖ్య

నెెల్లూరు(వైద్యం), న్యూస్‌టుడే : జిల్లాలో కరోనా కోరలు చాస్తోంది. శుక్రవారం 82 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటన జారీ చేసింది. దీంతో కేసులు 1340కి చేరాయి. ఏఎస్‌పేటలో మూడు, ఆత్మకూరు మండలంలోని నెల్లూరుపాళెంలో మూడు, చెర్లోయడవల్లిలో ఒకటి, వరికుంటపాడు మండలంలోని గణేశ్వరపురంలో ఒకటి, బోగోలు మండలంలోని కొత్తూరులో ఒకటి, డక్కిలి మండలంలోని పొనుగోడులో ఒకటి, బుచ్చిరెడ్డిపాళెంలో ఒకటి, విడవలూరు మండలంలోని పార్లపల్లిలో ఒకటి, నాయుడుపేటలో ఒకటి, మర్రిపాడు మండలంలోని పొందూరులో ఒకటి, నందవరంలో ఒకటి, పెళ్లకూరు మండలంలోని కల్వకూరులో ఒకటి, చేజర్లలో ఒకటి, నాగులవెల్లటూరులో అయిదు, బాలాయపల్లిలో ఒకటి, కామకూరులో రెండు, సంగం మండలంలోని వంగల్లులో ఒకటి, నెల్లూరులోని విజయమహల్‌ గేటులో ఒకటి, ఈద్గ్గామిట్టలో ఒకటి, ఏసీనగర్‌లో ఒకటి, మాగుంటలేఅవుట్‌లో అయిదు, పొదలకూరు రోడ్డులో రెండు, వెంగళరావునగర్‌లో ఒకటి, దర్గామిట్టలో రెండు, జెండా వీధిలో ఒకటి, అంబేడ్కర్‌నగర్‌లో ఒకటి, సంతపేటలో నాలుగు, మూలాపేటలో నాలుగు, ఉమ్మారెడ్డిగుంటలో ఒకటి, శెట్టిగుంటరోడ్డులో మూడు, హరనాథపురంలో రెండు, రామ్మూర్తినగర్‌లో ఒకటి, నారాయణరెడ్డిపేటలో ఒకటి, రంగనాయకులపేటలో ఒకటి, రాంజీనగర్‌లో ఒకటి, ఎన్టీఆర్‌ నగర్‌లో మూడు, రాంనగర్‌లో మూడు, రైల్వేగేటులో రెండు, కోటమిట్టలో మూడు, క్రాంతినగర్‌లో రెండు, అరవిందనగర్‌లో అయిదు, ప్రగతినగర్‌లో రెండు, సీఆర్‌పీ డొంకలో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి. నారాయణ కొవిడ్‌ ఆస్పత్రి నుంచి 34 మంది డిశ్ఛార్జి అయినట్లు ఆస్పత్రి నోడల్‌ అధికారి సుబ్బారావు తెలిపారు. జీజీహెచ్‌ కొవిడ్‌ ఆస్పత్రి నుంచి 39 మంది డిశ్ఛార్జి అయినట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుధాకర్‌రెడ్డి తెలిపారు. దీంతో డిశ్ఛార్జిల సంఖ్య 761కు చేరుకుంది.

మరో ఇద్దరి మృతి

నారాయణ కొవిడ్‌ ఆస్పత్రిలో మరో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆస్పత్రి నోడల్‌ అధికారి సుబ్బారావు తెలిపారు. వీరిలో సంతపేటకు చెందిన 60 ఏళ్ల వృద్ధురాలు ఒకరు, నాయుడుపేటకు చెందిన 61 ఏళ్ల వృద్ధుడు కొవిడ్‌తో చనిపోయినట్లు పేర్కొన్నారు. దీంతో జిల్లాలో మృతుల సంఖ్య 28కు చేరుకుంది. ఐసోలేషన్‌ కేంద్రాల్లో 551 మంది చికిత్స పొందుతున్నారు. క్వారంటైన్‌ కేంద్రాల్లో 293 మంది ఉన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.