close

శుక్రవారం, మే 29, 2020

తాజా వార్తలు

నలుగురి ఆత్మహత్య

చెరువులో దూకి...

ఎడపల్లి, న్యూస్‌టుడే: జానకంపేట అశోక్‌సాగర్‌ చెరువులో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకొన్నాడు. నిజామాబాద్‌ నగరంలోని కోటగల్లీకి చెందిన జగదీశ్‌(48) గురువారం రాత్రి పురుగుల మందు తాగి చెరువులో దూకి ఈ ఘటనకు పాల్పడ్డాడు. రెండున్నర ఏళ్ల క్రితం భార్య, పిల్లలు జగదీశ్‌ను వదిలివెళ్లడంతో మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. మృతుడి భార్య నిర్మల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎల్లయ్య గౌడ్‌ తెలిపారు.


జీవితంపై విరక్తితో యువకుడు..

ఆర్మూర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: పట్టణంలోని సంతోష్‌నగర్‌ కాలనీలో గురువారం రాత్రి మాదీనం కుమార్‌(25) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం ఎస్సై యాదగిరిగౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం... కొద్ది రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్న ఆయన ఉపాధిలేకపోవడంతో జీవితంపై విరక్తితో ఇంట్లో ఉరేసుకొని మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

దుబాయ్‌లో సిర్నాపల్లివాసి..

ఇందల్‌వాయి, న్యూస్‌టుడే: దుబాయిలోని నివాసపు గదిలో ఉరి వేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్థుల వివరాల ప్రకారం..సిర్నాపల్లికి చెందిన చీలమంతుల ప్రవీణ్‌కుమార్‌(40) ఆరు నెలల క్రితం ఉపాధి కోసం దుబాయి వెళ్లాడు. రెండు నెలల నుంచి పనులు లేకపోవడంతో మానసిక ఆందోళనకు గురై బుధవారం గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి తీసుకువచ్చే ఏర్పాట్లు చేయాలని బంధువులు కోరారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.


సంతానం కలగలేదని..

ఏర్గట్ల(కమ్మర్‌పల్లి), న్యూస్‌టుడే: పెళ్లై ఏళ్లు గడిచినా సంతానం కలగలేదని తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన శుక్రవారం ఏర్గట్ల మండలం దోంచెందలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. దోంచెందకు చెందిన నాగమల్ల రమేశ్‌- వాణిలకు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. సంతానం లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రమేశ్‌ (37) గురువారం పుష్కరఘాట్‌ సమీపంలోని వ్యవసాయ బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హరిప్రసాద్‌ తెలిపారు.


యాసిడ్‌ తాగిన మహిళ..

కామారెడ్డి నేరవిభాగం, న్యూస్‌టుడే: కడుపు నొప్పి బాధ భరించ లేని ఓ మహిళ యాసిడ్‌ తాగడంతో చికిత్స పొందుతూ గురువారం రాత్రి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో మరణించింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పంచముఖీ హనుమాన్‌ కాలనీకి చెందిన పద్మ చంద్రవ్వ (54) అనే మహిళ కొన్నాళ్లుగా కడుపు నొప్పితో బాధపడుతోంది. ఈ బాధ భరించలేని ఆమె ఈ నెల 17న ఇంట్లో ఉన్న యాసిడ్‌ తాగి బలవన్మరణానికి యత్నించింది. తీవ్ర అస్వస్ధతకు గురైన ఆమెను జిల్లా కేంద్ర అసుపత్రికి తరలించగా .. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుది శ్వాస విడిచినట్లు పట్టణ ఎస్సై రవికుమార్‌ తెలిపారు. కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన చెప్పారు.


ఆత్మహత్యకు తమ్ముడే కారణమా?

నిజామాబాద్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: సారంగాపూర్‌ మాజీ సర్పంచి కుంచపు పెద్దులు గురువారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారు. తమ్ముడు మానసిక ఒత్తిడికి గురి చేయడంతో ఈ ఘటనకు పాల్పడుతున్నట్లు రాసిన లేఖ మాజీ సర్పంచి జేబులో లభించినట్లు ఎస్‌హెచ్‌వో ప్రభాకర్‌ తెలిపారు. పెద్దులు భార్య హరిత తన మరిదిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.