బాధిత పిల్లలకు చెక్కులు అందజేత
eenadu telugu news
Published : 24/07/2021 06:06 IST

బాధిత పిల్లలకు చెక్కులు అందజేత

చిన్నారులకు చెక్కులు అందజేస్తున్న కలెక్టర్‌ శరత్‌

కామారెడ్డి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు జిల్లా కలెక్టర్‌ శరత్‌ శుక్రవారం ఆర్థిక సహాయం చెక్కులు అందజేశారు. అనాథలుగా మిగిలిన చిన్నారులకు 18 ఏళ్లు నిండే వరకు ప్రభుత్వం ప్రతి నెల రూ.2 వేల సహాయం అందిస్తోందని చెప్పారు. ఇప్పటి వరకు జిల్లాలో ముగ్గురు చిన్నారులను గుర్తించి చెక్కులు అందించామన్నారు. కార్యక్రమంలో మహిళాశిశు సంక్షేమశాఖ జిల్లా అధికారిణి అనురాధ, బాలరక్షభవన్‌ సమన్వయకర్త జానకి పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని