Published : 13/04/2021 05:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మహమ్మారిపై పోరాటం సాగిద్దాం


దర్శి: మాట్లాడుతున్న డీపీవో నారాయణరెడ్డి, వేదికపై అధికారులు

న్యూస్‌టుడే బృందం: కరోనా రెండో దశ విజృంభిస్తున్న తరుణంలో అందరూ టీకా వేయించుకుని అరికడదామని డీపీవో నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం దర్శి ఎంపీడీవో కార్యాలయంలో కొవిడ్‌ నివారణపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 45 ఏళ్లు దాటినవారు వ్యాక్సిన్‌ వేయించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు. తాళ్లూరు మండలం తూర్పుగంగవరం పీహెచ్‌సీలో వంద మందికి, కొమరోలు, రాజుపాలెంలో 68 మందికి వైద్యులు టీకా వేశారు. యర్రగొండపాలెంలో ఇద్దరికి కరోనా సోకిందని వైద్యుడు కోటానాయక్‌ తెలిపారు. త్రిపురాంతకంలోని అంబేడ్కర్‌ కాలనీలో 42 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో అంబేడ్కర్‌ కాలనీ, బ్రహ్మంగారి కాలనీ, దగ్గుల వారి వీధిను రెడ్‌జోన్‌గా ప్రకటించినట్లు తహసీల్దారు కిరణ్‌ తెలిపారు. కంభంలోనూ అవగాహన కల్పించారు. కార్యక్రమాల్లో తహసీల్దార్లు, వైద్యాధికారులు, రెవెన్యూ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని