Published : 13/04/2021 04:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఉరి వేసుకొని వ్యక్తి బలవన్మరణం


చంద్రకాంత్‌ (దాచిన చిత్రం)

పోలాకి, న్యూస్‌టుడే: ఉరి వేసుకొని వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిని ఘటన పోలాకి మండలంలో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్‌లోని బోయినపల్లికి చెందిన చంద్రకాంత్‌(40) వెల్డింగ్‌ పని చేస్తుండేవాడు. పోలాకి గ్రామం విశ్వేశ్వరనగర్‌కు చెందిన హైమావతి బతుకుదెరువుకు హైదరాబాద్‌ వెళ్లింది. అక్కడే ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి 2012లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వివాహం చేసుకున్న కొద్ది రోజులకే భర్త మద్యానికి బానిస కావడంతో గొడవలు మొదలయ్యాయి. తాగుడు మానమని పలు మార్లు చెప్పిన వినిపించుకోకపోవడంతో ఆరేళ్ల క్రితమే హైమావతి పిల్లలను తీసుకొని పోలాకి వచ్చేసింది. చంద్రకాంత్‌ హైదరాబాద్‌లోనే పని చేసుకుంటూ భార్యకు నెలనెలా డబ్బులు పంపేవాడు. నెల క్రితం అతను పోలాకి వచ్చి ఇక్కడే ఉండిపోవాలని నిశ్చయించుకున్నాడు. స్థానికంగానే వెల్డింగ్‌ షాపులో పనిలో చేరాడు. కానీ తాగడం మానకపోవడంతో మళ్లీ భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. వాటితో మనస్తాపానికి గురైన చంద్రకాంత్‌ ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఇంటికొచ్చి చూసేసరికి ఉరి వేసుకొని కనిపించడంతో ఆమె 108కి సమాచారం అందించింది. వారు వచ్చి చూసి చనిపోయినట్లు ధ్రువీకరించారు. కుటుంబీకుల నుంచి ఫిర్యాదు అందటంతో ఎస్‌.ఐ. చిన్నమనాయుడు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని