close

బుధవారం, ఆగస్టు 12, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

లేఅవుట్‌లో నిలిచిన వర్షపు నీరు

లేఅవుట్‌లో నిలిచిన వర్షపు నీటిని బయటకు పంపేందుకు

గండికొడుతున్న ఉపాధి కూలీలు

ఉప్పలగుప్తం: పేదలకు ఇళ్ల స్థలాలుగా అందజేసేందుకు ఉప్పలగుప్తం మండలం సరిపల్లిలో ఏర్పాటు చేసిన లేఅవుట్‌లో వర్షం నీరు నిలిచిపోయింది. సుమారు 180 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు అందజేసేందుకు ఇక్కడ రూ. 1.80 కోట్లు వెచ్చించి 4 ఎకరాలు కొనుగోలు చేశారు. దానిని రూ. 26 లక్షలతో మెరక చేసి లేఅవుట్‌ వేశారు. ఈ పనులు గుత్తేదారుకు అప్పగించి పూర్తి చేశారు. అయినా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఈ లేఅవుట్‌లో నీరు నిలిచిపోయింది. దీనిపై ఎంపీడీవో కె.విజయప్రసాద్‌ వివరణ కోరగా లేఅవుట్‌ మధ్యలో ఏర్పాటు చేసిన రహదారుల వల్ల నీరు నిలిచిందని, మురుగు పారుదల వ్యవస్థను సరి చేస్తున్నామని, లెవిలింగ్‌ పనులు సక్రమంగానే చేశామని తెలిపారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.