close

ఆదివారం, ఆగస్టు 09, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఘాట్‌ రోడ్డులో లారీ బోల్తా

గాయాలతో బయటపడిన డ్రైవర్‌, క్లీనర్‌


మారేడుమిల్లి- చింతూరు ఘాట్‌రోడ్డులో ప్రమాదానికి గురైన లారీ

 

వాలమూరు (మారేడుమిల్లి): మన్యంలోని మారేడుమిల్లి- చింతూరు ఘాట్‌రోడ్డులో ఓ లారీ ప్రమాదానికి గురైంది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కృష్ణాజిల్లా విస్సన్నపేట మండలం నరసాపురం గ్రామానికి చెందిన డ్రైవర్‌ బి.చెన్నారావు, క్లీనర్‌ మాధవ్‌ లారీలో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం రాయ్‌పూర్‌ నుంచి ఇనుప ఊచల లోడుతో మండపేటకు బయలుదేరారు. ఈ క్రమంలో గుజ్జుమామిడివలస పంచాయతీ పరిధిలోని వాలమూరు సమీపంలో ఘాట్‌రోడ్డుపైకి చేరగానే స్టీరింగ్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అదుపుతప్పి పైనుంచి కింద రహదారిపై పడిపోయింది. ఈ ప్రమాదంలో లారీ నుజ్జునుజ్జు కాగా, డ్రైవర్‌, క్లీనర్‌ గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను మారేడుమిల్లి పీహెచ్‌సీకి తరలించగా అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యసేవల కోసం రాజమహేంద్రవరం తరలించారు. దీనిపై మారేడుమిల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మహిళ హత్యకేసులో నిందితుల అరెస్టు

ధవళేశ్వరం: ధవళేశ్వరం క్వారీకెనాల్‌ రోడ్డులో గత నెల 26న సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసులో నిందితులను ధవళేశ్వరం పోలీసులు అరెస్టు చేశారు. ధవళేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దక్షిణ మండల డీఎస్పీ వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. హత్యకేసులో నిందితులైన అనంతపురానికి చెందిన చెక్కా పవన్‌కుమార్‌, అతడి భార్య లక్ష్మిని గురువారం మధ్యాహ్నం 3 గంటలకు బొమ్మూరు కూడలి వద్ద సీఐ అడబాల శ్రీను అరెస్టు చేశారన్నారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన చాకు, బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నామని, వారిని కోర్టులో హాజరుపరుస్తామని వివరించారు. సమావేశంలో ఎస్సై గణేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.