close

బుధవారం, ఆగస్టు 12, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హద్దు మీరి ఆక్రమణలు!

● హరిత మొక్కలకు శాపాలు

● ప్రత్యేక అధికారుల పరిశీలన శూన్యం

న్యూస్‌టుడే, గద్వాల

ధరూరు- గుడ్డెందొడ్డి దారిలో రోడ్డుకు ఆనుకొని వ్యవసాయ పొలంగా మార్చిన దృశ్యం

ఇళ్లు కట్టాలన్నా మొక్క నాటాలన్నా ఆలోచించాలి. ఎందుకంటే కట్టిన ఇంటిని.. పెరిగిన చెట్టును తొలగించడం కష్టం. జిల్లాలో కొన్నిశాఖల అధికారులకు ఈ విషయం తెలియనట్లు అనిపిస్తోంది. రహదారుల పొడవునా ఇరువైపులా ప్రతి ఐదు అడుగుల దూరంలో ఒక మొక్క చొప్పున నాటుతున్నారు. జోగులాంబ జిల్లాలో అన్ని రహదారుల వెంట ఇరువైపులా నాటే మొక్కల లెక్క చూస్తే లక్షల్లోనే ఉంటుంది. అయితే, అసలు కథ అక్కడే ఉంది. రహదారులకు ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమి హద్దులు చెరిపి కొందరు పొలాలుగా మార్చుకున్నారు. ఆక్రమించిన భూమిలో పంటలు సాగు చేయడంతో మొక్కలు ఎక్కడ నాటాలో అర్థంకాని పరిస్థితి. చేసేది లేక.. వచ్చే కూలీ వదులుకోలేక రహదారులకు ఇరువైపులా నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా బీటీ దారికి ఆనుకొని మొక్కలు నాటుతున్నారు. కళ్లెదుటే ఇది జరుగుతున్నా.. ఉపాధి, పంచాయతీ సిబ్బంది చోద్యం చూస్తున్నారు. ప్రత్యేక పరిశీలన కోసం నియమించిన అధికారులు కూడా దీనిపై పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. నాటిన మొక్కల లెక్కల్లో చూపించడానికి ఇది పనికోస్తుందేమో.. కాని ఇందులో భవిష్యత్తు హరిత లక్ష్యం కనిపించదు. చెట్టు పెరిగినా రోడ్ల విస్తరణ సమయంలో మళ్లీ నరికేయక తప్పదు. దీనివల్ల హరితహారం పేరుతో రూ.కోట్లు వృథా కావడంతోపాటు పర్యావరణానికి విఘాతం కలుగుతుంది.

భవిష్యత్తులో శాపమే : జాతీయ రహదారి 280 ఫీట్ల వెడల్పులో ఉంటుంది. రాష్ట్ర రహదారులు 100 ఫీట్ల వెడల్పులో ఉంటాయి. గ్రామీణ రహదారుల రెండు వైపులా కలిపి 60 ఫీట్ల వెడల్పు ఉండాలి. కాని గద్వాల నుంచి మొదలుకొని జిల్లాలో రహదారులన్నీ రెండు వైపులా ఆక్రమణకు గురయ్యాయి. మధ్యలో ఉన్న బీటీ రహదారి తప్ప మిగతా రెండు వైపులా పంట పొలాలే కనిపిస్తాయి. హద్దులు చెరిపేసి ఆక్రమించుకొన్నా యంత్రాంగం మిన్నకుండిపోతోంది. ప్రస్తుతం నాటుతున్న మొక్కలు బీటీరహదారి నుంచి కనీసం 25 ఫీట్ల దూరంలో ఉంటే హద్దు చివరన మొక్కలు నాటాల్సి ఉంటుంది. ఇలా చేస్తే భవిష్యత్తులో రోడ్ల విస్తరణ సమయంలో మొక్కలు మాన్లుగా మారినా తొలగించాల్సిన అవసరం ఉండదు. కాని అందుకు విరుద్ధంగా బీటీ రహదారికి కేవలం రెండు ఫీట్ల దూరంలో మొక్కలు నాటుతున్నారు. దీని కారణంగా రహదారులకు ఇరువైపులా నాటుత్నున 3.50 లక్షల మొక్కలకు భవిష్యత్తులో శాపం తప్పెట్లు లేదు.


డీఆర్డీఏ అధికారులకు సూచించాం : గ్రామీణ రాష్ట్ర రహదారుల వెంబడి ఇరువైపులా మొక్కలు నాటే విషయంలో ఇప్పటికే డీఆర్డీఏ అధికారులకు నిబంధనలతో కూడిన వివరాలు పంపించాం. రహదారులకు రెండు వైపులా ప్రభుత్వం భూమి ఎంతవరకు ఉందో గుర్తించి చివరన మొక్కలు నాటాల్సి ఉంటుంది.

- కిరణ్‌కుమార్‌, రహదారులు భవనాలశాఖ డీఈ, జోగులాంబ జిల్లా


రహదారులు భవనాలశాఖ పరిధిలోని రోడ్లు : 440.10 కి.మీ

పంచాయతీరాజ్‌ రోడ్లు : 1,724.84 కి.మీ

జాతీయ రహదారి రోడ్లు : 41.00 కి.మీ

మొక్క నాటడానికి..పది నెలలపాటు నీళ్లు పోయడానికి కంచె ఏర్పాటుకు

రూ.80

రూ.8

గుంత తవ్వడానికి..ఏడాదికి మొక్కకు కాపలాకు ఒక మొక్కకు అయ్యే ఖర్చు

రూ.50

రూ.43

రూ.490

రూ.180

నర్సరీలో మొక్కపెంచడానికి..


 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.