close

బుధవారం, ఆగస్టు 12, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పొదుపు లెక్కలపై ఆరా

స్వశక్తి సంఘాలపై గ్రామాల్లో తనిఖీలు ●

జిల్లాలో 13 నుంచి ప్రారంభం కానున్న ప్రక్రియ

న్యూస్‌టుడే, రాజోలి

అతివలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు, స్వశక్తితో ఎదిగేందుకు సెర్ప్‌ పొదుపు సంఘాల మహిళలకు ఏటా రుణాలు అందజేస్తోంది. బ్యాంకుల నుంచి తీసుకొన్న రుణాలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడం లేదు. కొందరు సభ్యుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో.. గ్రామాల్లోని పొదుపు సంఘాల్లో ప్రతి పైసా లెక్క తేల్చేందుకు అంతర్గత తనిఖీలు నిర్వహించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా అధికారులకు ఆదేశాలందాయి. జిల్లావ్యాప్తంగా బృందాలను ఏర్పాటు చేసి ఈ నెల 13 నుంచి తనిఖీలు చేపట్టనున్నారు.

అంతర్జాలంలో నమోదు : ప్రత్యేకంగా కేటాయించిన బృందాలు గ్రామాల్లో పొదుపు లెక్కలను తేల్చనున్నారు. నిల్వ సొమ్ము, ఖర్చులు, జమ, ఏ పనికి ఎంత మొత్తాన్ని ఖర్చు చేశారు. రశీదులున్నాయా.? వాటి వ్యత్యాసాలను పరిశీలిస్తారు. సభ్యులందరి ఆమోద ముద్రతో డబ్బు ఖర్చు చేశారా.? అనే కోణంలో ఆరా తీస్తారు. వీటన్నింటి వివరాలను ఎప్పటికప్పుడు అంతర్జాలంలో నిక్షిప్తం చేయనున్నారు. లెక్కల్లో తేడాలొస్తే.. సొమ్ము రాబట్టనున్నారు. తనిఖీలకు సంబంధించిన వివరాలపై ప్రతివారం ఏపీఎం ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించాలి.

జిల్లాలో 6,125 స్వశక్తి సంఘాలు : జోగులాంబ గద్వాల జిల్లాలో 12 మండలాల్లో స్వశక్తి సంఘాలున్నాయి. మొత్తం 310 గ్రామైక్య సంఘాల పరిధిలో 6,125 స్వశక్తి సంఘాలుండగా.. 68,900 మంది సభ్యులున్నారు. అర్హులైన వారికీ బ్యాంకు లింకేజీ ద్వారా ఏటా రూ.95 కోట్లకుపైగా బ్యాంకు రుణాలు అందజేస్తున్నారు. పొదుపు మంత్రంతో పైసాపైసా కూడగట్టిన మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్నారు. చిరువ్యాపారాలు, పరిశ్రమలు ఇతర రంగాల్లో స్వయం ఉపాధి పొందుతూ.. ప్రతినెలా రుణ వాయిదాలు చెల్లిస్తున్నారు. గ్రామైక్య సంఘాలతో ప్రతినెలా సమావేశాలు ఏర్పాటు చేసి, రుణాలు, ఇతర ఆదాయ అభివృద్ధిపై చర్చించి రికార్డుల్లో నమోదు చేసుకోవాలి. చాలాచోట్ల సమావేశాలు సక్రమంగా జరగడం లేదు. ఫలితంగా సొమ్ము పక్కదారి పడుతుందనే ఫిర్యాదులున్నాయి. అన్ని సంఘాల తనిఖీలు నిర్వహించడం వల్ల, మహిళలకు మేలు జరుగుతుందని అధికారులు అంటున్నారు.


సమావేశమైన మహిళా సంఘాల సభ్యులు

ఆదేశాలొచ్చాయి : గ్రామాల్లోని అన్ని పొదుపు సంఘాల్లో సామాజిక తనిఖీలు నిర్వహించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలొచ్చాయి. సోమవారం నుంచి తనిఖీలు నిర్వహించనున్నాం. తనిఖీలు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటాం.

- జయన్న, డీపీఎం, జోగులాంబ గద్వాల


మండలాల వారీగా వివరాలు

అలంపూర్‌ 17 370 3918

ధరూర్‌ 30 577 6591

గద్వాల 33 566 6588

గట్టు 35 664 7473

అయిజ 33 611 7118

ఇటిక్యాల 40 605 6643

కేటిదొడ్డి 19 434 5064

మల్దకల్‌ 35 682 7833

మానవపాడు 22 510 5497

రాజోలి 16 398 4418

ఉండవల్లి 18 417 4354

వడ్డేపల్లి 12 291 3403

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.