close

బుధవారం, సెప్టెంబర్ 23, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కృష్ణమ్మ పరుగు కనువిందు

సోమశిలకు సందర్శకుల తాకిడి

న్యూస్‌టుడే, సోమశిల (కొల్లాపూరు)

బిరబిరా పరుగులిడుతూ.. కృష్ణమ్మ ప్రవాహం సందర్శకులను మైమరపింజేస్తోంది. మంగళవారం నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌ మండలం సోమశిల కృష్ణాతీరంలో నదిలోకి భారీగా వరదజలాల చేరికతో దిగువన శ్రీశైలం ప్రాజెక్టు వరకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహించింది. పుష్కరఘాట్లపైకి వరదజలాలు రావడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యటకులు, సందర్శకుల తాకిడి పెరిగింది. కొల్లాపూర్‌ పురపాలిక కమిషనర్‌ వెంకటయ్య, కోఆప్షన్‌ సభ్యుడు వెంకటస్వామి, చుక్కాయిపల్లి మాజీ ఉపసర్పంచి రెడ్డిరమేష్‌యాదవ్‌, పురసిబ్బంది సాయంతో సోమశిలలో తాగునీటి పథకం మోటార్లు వరదజలాలలో మునిగిపోకుండా ఎగువ ప్రాంతానికి తరలించారు.

సందర్శకుల సందడి.. : సోమశిల, సిద్ధేశ్వరం గుట్టల మధ్య కృష్ణానది ప్రవాహం కనువిందు చేస్తోంది. నది వద్ద కొత్తగా వచ్చిన కృష్ణాజలాల్లో పుణ్యస్నానాలు చేస్తూ.. సందడి చేస్తున్నారు. నదీతీర ప్రాంతంలో కుటుంబసభ్యులు, స్నేహితులతో సంతోషంగా గడుపుతున్నారు. తీరగ్రామాలైన మల్లేశ్వరం, మంచాలకట్ట, సోమశిల, అమరగిరి, జటప్రోల్‌ తదితర గ్రామాలకు సందర్శకుల తాకిడి పెరిగింది. వలలు, పుట్టీలను మత్స్యకారులు తయారు చేసుకుంటూ నదిలో చేపలవేట ముమ్మరంగా చేపడుతున్నారు. వరద నీటితో వస్తున్న చేపలను మత్స్యకారులు వేటాడుతున్నారు. 2 కిలోల నుంచి 5, 10, 12 కిలోల చేపలు వలకు చిక్కుతున్నాయని.. బొచ్చ, రవుటా, పిలాచీ, జల్ల తదితర రకాల చేపలు వలకు చిక్కడంతో మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పర్యటకులు, సందర్శకుల సంఖ్య పెరుగుతుండటంతో సోమశిలలోని వీఐపీ ఘాట్‌ వద్ద చెత్తా, చెదారం తొలగించి ఘాట్లను శుభ్రం చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఎంపీడీవో శేషగిరిశర్మను వివరణ కోరగా సోమశిలలోని పుష్కరఘాట్లను శుభ్రం చేసేలా వెంటనే పంచాయతీ అధికారులకు ఆదేశాలిస్తామన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.