close

బుధవారం, సెప్టెంబర్ 23, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రాయితీ రుణాలకు..నాలుగేళ్లుగా ఎదురుచూపులు

491 మందికి మాత్రమే మంజూరు

న్యూస్‌టుడే, వనపర్తి (న్యూ టౌన్‌)


వనపర్తిలోని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కార్యాలయం

నిరుద్యోగ యువతలో కొందరు.. అంతకుముందే చిరు వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకు మరికొందరు ప్రభుత్వం అందించే రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటే ఇప్పటికీ వారి ఆశ నిరాశగానే మిగిలింది. వనపర్తి జిల్లాలో జిల్లా వెనుకబడిన తరగతుల శాఖలో వివిధ రకాల రాయితీ రుణాల మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి నాలుగేళ్లుగా ఎదురుచూపులు తప్పడం లేదు. బీసీ ఫెడరేషన్‌, కార్పొరేషన్‌ అందించే రుణాల కోసం జిల్లాలో అధిక సంఖ్యలో ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 4,628 మంది ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించారు. రూ. లక్ష నుంచి రూ. 10 లక్షల వరకు రాయితీపై వీటిని అందజేయనున్నారు.

వరుస ఎన్నికలతో ప్రభావం..

కుటుంబానికి ఆసరాగా ఉండాలని నిరుద్యోగులు, తమ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని చిరు వ్యాపారులు, కుల వృత్తిదారులు ఇలా అనేక మంది రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రూ.లక్ష రుణాలకు దరఖాస్తు చేసుకున్న 491 మందికి (రూ.50 వేల చొప్పున) మాత్రమే ఇప్పటి వరకు అందజేశారు. మిగతా కేటగిరీలు అంటే రూ. లక్ష, రూ.2 లక్షలు, రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు దరఖాస్తు చేసుకున్న వారికి ఎదురుచూపులు తప్పడం లేదు. దరఖాస్తుదారులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. శాసనసభ, పంచాయతీ, ఎమ్మెల్సీ, లోక్‌సభ, ఎంపీటీసీ, జడ్పీటీసీీ ఎన్నికలు వరుసగా రావడంతో రుణాల మంజూరు అలాగే నిలిచిపోయింది. ఆ తరవాత పుర పోరు ముగిసినా నేటికీ వాటి జాడ లేదు.

4,157 మందికి అందేదెప్పుడో ?

2016-17, 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. లక్ష కేటగిరీలో మొత్తం 624 మంది దరఖాస్తు చేసుకోగా 2,45,50,000ల రుణాలు మంజూరయ్యాయి. 133 మందికి రాలేదు. ఇదే కేటగిరిలో వ్యవసాయ, పశుసంవర్థక, చిన్ననీటిపారుదల శాఖలకు సంబంధించిన వారూ దరఖాస్తు చేసుకున్నా.. ఎవరికీ మంజూరు కాలేదు. రెండో కేటగిరీ రూ. 2 లక్షల నుంచి రూ.3 లక్షల మధ్యలో రుణాల మంజూరు కోసం 1,869 మంది, మూడో కేటగిరి రూ. 3 లక్షల నుంచి రూ. 10 లక్షల రుణాలకు దరఖాస్తు చేసుకున్న 2,155 మందికీ రుణాలు అందలేదు. ఇలా మొత్తం 4,157 మంది ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం వీలైనంత త్వరగా రుణాలు మంజూరు చేసి తమ భవిష్యత్తుకు సహకరించాలని కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తేనే రుణాల మంజూరుకు చర్యలు చేపడతామని జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఇన్‌ఛార్జి అధికారి ఇందిర తెలిపారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.