close

శుక్రవారం, అక్టోబర్ 23, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొవిడ్‌ సేవల్లో.. అట్టడుగే!

ఆసుపత్రుల వారీగా ర్యాంకుల ప్రకటన


జీజీహెచ్‌ కొవిడ్‌ ఆసుపత్రి

నెల్లూరు(వైద్యం), కావలి, న్యూస్‌టుడే: కొవిడ్‌ వైద్య సేవలు ఇక్కడ అంతంత మాత్రమేనని తేలింది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా కొవిడ్‌-19 సేవలకు సంబంధించిన ర్యాంకులు ప్రకటించగా- జిల్లా 13వ స్థానంలో ఉండిపోయింది. ఆసుపత్రుల వారీగా ప్రకటించిన ర్యాంకుల్లో మాత్రం కావలి ఏరియా ఆసుపత్రి ఆరో స్థానంలో నిలవడం కొంత ఊరట కలిగించే అంశం. కాగా, ఈ విషయాలపై స్పందించేందుకు అధికారులు సుముఖత చూపకపోవడం గమనార్హం.

ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్‌ ఆసుపత్రులను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా జిల్లాలోనూ 11 ఉన్నాయి. వీటిల్లో కొవిడ్‌ బాధితులకు అందుతున్న వైద్య సేవలు- రోగుల వివరాల నమోదు, ఆన్‌లైన్‌ నమోదు తదితర విషయాల్లో జిల్లా బాగా వెనుకబడింది. ఆసుపత్రుల వారీగా చూస్తే కావలి ఆసుపత్రి 2087 పాయింట్లతో ఆరో స్థానంలో నిలవగా- ఆ తర్వాత ఆ దరిదాపుల్లో జిల్లాలోని ఏ ఆసుపత్రి లేదు. నెల్లూరు జీజీహెచ్‌ ప్రాంతీయ కొవిడ్‌ ఆసుపత్రి 1533 పాయింట్లతో 165 స్థానంలో నిలవడం గమనర్హం. ఆత్మకూరు జిల్లా ఆసుపత్రి 1233 పాయింట్లతో 206 స్థానంలో నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించిన ర్యాంకుల్లో 13వ స్థానంతో సరిపెట్టుకోగా- జిల్లా వ్యాప్తంగా ఉన్న 11 ఆసుపత్రులకు 16,538 పాయింట్లు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1503 సగటుతో జిల్లా చివరి స్థానంలో సరిపెట్టుకుంది.

కారణాలు విశ్లేషిస్తే..

జీజీహెచ్‌ కొవిడ్‌ ఆసుపత్రిలో కొంత కాలంగా భోజనం నాణ్యంగా లేదని, బాధితులను సరిగా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. పలు లోపాలు వెల్లడయ్యాయి. మార్చురీలో మృతదేహాలను ఉంచేందుకు సరైన వసతులు లేకపోవడం, సీటీస్కాన్‌, ఎంఆర్‌ఐ వంటి పరికరాలు లేకపోవడం ప్రతికూలంగా మారింది.

పాజిటివ్‌ కేసులను గుర్తించడంలో అధికారులు కొంత వరకు గట్టిగానే కృషి చేసినా.. ఆసుపత్రుల్లో సేవలందించడంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ప్రాంతీయ కొవిడ్‌ ఆసుపత్రి ఉన్నా.. సేవల్లో చెప్పుకోదగ్గ రీతిలో మన్ననలు పొందలేకపోయింది. ఇదే విషయం ఇప్పుడు ర్యాంకుల్లోనూ స్పష్టమైంది. ఇక కొన్ని ప్రైవేటు ఆసుపత్రులపై పలు ఆరోపణలు వెల్లువెత్తగా.. ఇటీవల వైద్యశాఖ అధికారులు నోటీసులు సైతం జారీ చేశారు.

హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్న వారిపై దృష్టి సారించడంలో వైద్యశాఖ అధికారులు విఫలమయ్యారు. వీరికి సకాలంలో మందులు అందించడం, వారి ఆరోగ్య పరిస్థితుల పర్యవేక్షణలో లోపాలు బయటకు వచ్చాయి.

బాధితులను ఆసుపత్రులకు తరలించడంలో ఆలస్యం నెలకొనడం, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయిన వారిని ఇళ్లకు తరలించడం తదితరాలు సక్రమంగా జరగలేదు. ఆసుపత్రుల్లో మరణాలు సైతం ఎక్కువగా చోటు చేసుకోవడం ర్యాంకింగ్‌పై ప్రభావం చూపిందన్న మాట వినిపిస్తోంది.

కావలి ఆసుపత్రికి ఆరోస్థానం : డాక్టర్‌ చెన్నయ్య, జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ర్యాంకుల్లో కావలి ఏరియా ఆసుపత్రికి ఆరోస్థానం వచ్చింది. కొవిడ్‌ రోగుల వివరాల నమోదు, మెరుగైన సేవలందించడం తదితర అంశాల్లో ఈ స్థానం దక్కింది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.