close

శుక్రవారం, అక్టోబర్ 23, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఉద్యోగం పేరుతో రూ.35 లక్షల స్వాహా

వెంకటగిరి: ఎల్‌ఐసీలో ఉద్యోగం ఇప్పిస్తానని ఓ వ్యక్తి యువకుడి నుంచి రూ.35 లక్షల మేర రాబట్టుకొని మోసం చేసిన సంఘటన పట్టణంలో చోటుచేసుకుంది. ఎస్సై అనూష కథనం మేరకు.. స్థానిక కచ్చేరివీధికి చెందిన వెంకట పవన్‌కుమార్‌ అనే యువకుడికి ఆన్‌లైన్‌లో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఎల్‌ఐసీలో ఉద్యోగం ఇప్పిస్తానని యువకుడికి ఆశ చూపారు. జీఎస్టీతో కలుపుకొని వివిధ రుసుముల కింద రూ.35 లక్షలను ఆన్‌లైన్‌ ద్వారా లావాదేవీలు చేసుకున్నాడు. ఆ తరువాత ఎలాంటి స్పందన లేకపోవడంతో.. యువకుడు తాను మోసపోయాయని గ్రహించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.