close

శుక్రవారం, అక్టోబర్ 23, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వైకాపా రైతుల పక్షం

వారి కోసమే వ్యవసాయ బిల్లులకు మద్దతు

మంత్రి మేకపాటి గౌతంరెడ్డి


ధాన్యం కొనుగోలుపై చర్చించుకుంటున్న మంత్రులు

నెల్లూరు(నగరపాలక సంస్థ), న్యూస్‌టుడే: వైకాపా ఎల్లప్పుడూ రైతుల పక్షమేనని.. వారి అభ్యున్నతిని ఆకాంక్షించే పార్లమెంటులో వ్యవసాయ బిల్లుకు మద్దతు ఇచ్చామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అన్నారు. ఆయన తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబుతో విలేకరులతో మాట్లాడారు. రైతులను అన్నివిధాలా ముందుకు తీసుకెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రైతులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అండగా ఉంటారని, ఈ క్రమంలోనే జిల్లా రైతులపై పెట్టిన కేసులను కొట్టేసినట్లు తెలిపారు. వర్షంతో రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో 1.50 లక్షల టన్నుల ధాన్యం సేకరణ జరిగిందన్నారు. రబీలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని గోదాముల నుంచి పూర్తిస్థాయిలో బయటకు పంపలేక పోయామని, ఫలితంగా నిల్వకు ఇబ్బందులు తలెత్తాయని వివరించారు. ధాన్యం తరలింపునకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రత్యేక చొరవ తీసుకున్నారని, ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. 30 వేల టన్నుల ధాన్యాన్ని ఇతర జిల్లాలకు పంపుతున్నామని, ఇంకా 1.50 లక్షల టన్నులు సేకరించాల్సి ఉందన్నారు. కేంద్ర కమిటీ జిల్లాలో నీటమునిగిన పంటలు పరిశీలిస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

మంత్రుల భేటీ..

రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డితో జలవనరులశాఖ మంత్రి డాక్టర్‌ పి.అనిల్‌కుమార్‌ మంగళవారం భేటీ అయ్యారు. గాంధీనగర్‌లోని మేకపాటి క్యాంపు కార్యాలయంలో కలిసి జిల్లాలోని పలు అంశాలపై చర్చించారు. దిల్లీ పర్యటనతో పాటు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.