close

శుక్రవారం, అక్టోబర్ 23, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అక్షర దీపిక.. సార్వత్రిక వేదిక

‘ఓపెన్‌’లో పది, ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు

అక్టోబర్‌ 10 తుది గడువు

దూరవిద్య వెబ్‌సైట్‌

న్యూస్‌టుడే- దుత్తలూరు, నెల్లూరు(విద్య) : ఆర్థిక సమస్యలు.. కుటుంబ బాధ్యతలు.. కొందరిని చదువుకు దూరం చేస్తుంటాయి. కలల భవితను కల్లగా మారుస్తుంటాయి. విద్యనభ్యసించాలన్న తపన.. ఉద్యోగం సాధించాలన్న పట్టుదల ఉంటే.. అసాధ్యాన్ని సుసాధ్యం చేయొచ్ఛు ప్రాథమిక విద్యాభ్యాసం చేయకున్నా.. అనివార్య కారణాలతో అర్ధంతరంగా చదువు మానేసినా.. చింతించాల్సిన అవసరం లేదు. అలాంటి వారికి ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం(ఏపీవోఎస్‌ఎస్‌) సువర్ణావకాశం కల్పిస్తోంది. ఏటా దూరవిద్య(ఓపెన్‌ స్కూల్‌) ద్వారా పది, ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలు కల్పిస్తోంది. 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇటీవలే ప్రకటన జారీ చేసింది.

జిల్లాలో 46 కేంద్రాలు..

జిల్లా వ్యాప్తంగా 46 దూర విద్య కేంద్రాలున్నాయి. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది పది, ఇంటర్‌లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అక్టోబరు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్ఛు రూ.200 అపరాధ రుసుముతో అక్టోబరు 31 వరకు గడువు విధించారు. పదిలో ప్రవేశాలకు అభ్యర్థులు రూ.100 రిజిస్ట్రేషన్‌ రుసుము చెల్లించాలి. ప్రవేశాలకు జనరల్‌ అభ్యర్థులు రూ.1,500; మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మాజీ సైనికుల పిల్లలు రూ.1,150 కట్టాలి. ఇంటర్లో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్‌ రుసుము రూ.200, జనరల్‌ విభాగంలో రూ.1,900; మహిళలు, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మాజీ సైనికుల పిల్లలు రూ.1,550 చెల్లించాలి. అభ్యర్థులు ఏపీ ఆన్‌లైన్‌ కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్ఛు మరిన్ని వివరాలకు ఆయా కేంద్రాల్లోని సమన్వయకర్తలను సంప్రదించవచ్ఛు

 

గతేడాది 5,681..

గతేడాది పదో తరగతిలో 2,781 మంది, ఇంటర్‌లో 2,900 మంది చొప్పున మొత్తం 5,681 మంది దూర విద్యలో ప్రవేశాలు పొందారు. వీరికి సెలవు రోజుల్లో మాత్రమే తరగతులు నిర్వహిస్తారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా 30 తరగతులకు హాజరు కావాల్సి ఉంటుంది. పదిలో ప్రవేశాలకు మాత్రం 2020, ఆగస్టు 31 నాటికి పద్నాలుగేళ్లు నిండి ఉండాలి. ఎలాంటి విద్యార్హత, గరిష్ఠ వయోపరిమితి అవసరం లేదు. ఇంటర్లో ప్రవేశానికి మాత్రం పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత తప్పనిసరి. అభ్యర్థులు www.apopenschool.org వెబ్‌ పోర్టల్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

సద్వినియోగం చేసుకోవాలి

వివిధ కారణాలతో మధ్యలోనే చదువు మానేసిన, పూర్తిగా చదువుకోలేక పోయిన వారికి సార్వత్రిక విద్యాపీఠం ఓ వరం. పది, ఇంటర్మీడియట్‌ అభ్యసించేందుకు మంచి అవకాశం. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. సార్వత్రిక విద్య ధ్రువీకరణ పత్రాలు సాధారణ పాఠశాలల పత్రాలతో సమానం. ఉన్నత చదువులు, ఉద్యోగావకాశాలకు ఎంతగానో దోహదపడుతుంది. ఈ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు కేంద్ర, రాష్ట్ర ఉద్యోగాలు సాధిస్తున్నారు. - ఎల్‌సీ రమణారెడ్డి, జిల్లా సమన్వయకర్త

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.