close

బుధవారం, ఆగస్టు 12, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సంక్షోభ సమయంలోనూ దూర దృష్టితో అడుగులు

● పొగాకు బోర్డు ఛైర్మన్‌ యడ్లపాటి రఘునాథబాబు

సమావేశంలో మాట్లాడుతున్న యడ్లపాటి రఘునాథ్‌ బాబు

ఒంగోలు సాంస్కృతిక విభాగం, న్యూస్‌టుడే: కరోనా సంక్షోభ సమయంలో అత్యంత దూర దృష్టితో దేశ ఆర్థిక రంగాన్ని గట్టెంచిన ఘనత ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వానికి దక్కతుందని పొగాకు బోర్డు ఛైర్మన్‌, భాజపా నాయకుడు యడ్లపాటి రఘునాథ్‌బాబు అన్నారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ పథకం ద్వారా కేంద్రం ప్రజలకు అందించిన సాయం గురించి తెలిపే క్రమంలో శుక్రవారం ఆయన ఒంగోలుకు వచ్చారు. స్థానిక ఏకేవీకే డిగ్రీ కళాశాల ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కరోనా ఇబ్బందులున్నా ప్రధాని ఆత్మ నిర్భర్‌ భారత్‌ పథకం ద్వారా రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించి పేదలను ఆదుకున్నారని తెలిపారు. ఆ పథకం కింద వివిధ వర్గాలు, రంగాలకు ఇచ్చిన తోడ్పాటును వివరించారు. ఇలాంటి క్లిష్ట సమయంలో దేశం, రాష్ట్రాలు కలిసి పనిచేస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్న ఆయన- కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని విమర్శించారు. వలస కూలీల ఉపాధి విషయంలో సాయం చేసేందుకు కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు రూ. ఎనిమిది వేల కోట్ల సాయం చేసిందన్నారు. రామాయపట్నం పోర్టు అభివృద్ధికి కూడా తమ వంతు సహకారం ఉంటుందన్నారు. ఉల్లి, పొగాకు పంటల అమ్మకాలకు సంబంధించి రైతులకు మేలు జరిగేలా కృషి చేస్తోందని వివరించారు. సమావేశంలో ఒంగోలు పార్లమెంట్‌ భాజపా అధ్యక్షుడు శిరసనగండ్ల శ్రీనివాస్‌, వివిధ హోదాల నాయకులు పూనిపర్తి పవన్‌రాజ్‌, రావులపల్లి నాగేంద్రయాదవ్‌, సెగ్గం శ్రీనివాసరావు, డాక్టర్‌ కొమ్మి నరసింగరావు, బొద్దులూరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. భాజపా నాయకుడు ఈదర హరిబాబు రఘనాథ్‌బాబును మర్యాద పూర్యకంగా కలిసి అభినందనలు తెలిపారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.