close

బుధవారం, ఆగస్టు 12, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

డబ్బుల కోసమే అపహరణ

నిందితులు, బాధితుడిపై పలు కేసులు

● ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు

వివరాలు వెల్లడిస్తున్న సీపీ ఆర్కే మీనా

విశాఖపట్నం (ఎం.వి.పి.కాలనీ), న్యూస్‌టుడే: మోసగాళ్లను కిడ్నాప్‌ చేసి వాళ్లు అక్రమంగా సంపాదించిన సొమ్మును కాజేస్తే ఎటువంటి ఫిర్యాదులు, విచారణలు ఉండవని భావించిన ఇద్దరు వ్యక్తులు పోలీసులకు చిక్కారు. విశేషమేమంటే.. ఈ ఇద్దరూ కూడా మోసగాళ్లే కావడం. విశాఖ నగరంలో సంచలనం సృష్టించిన ఈ కేసుకి సంబంధించిన వివరాల్ని శుక్రవారం విలేకరుల సమావేశంలో నగర పోలీసు కమిషనర్‌ ఆర్కే మీనా వెల్లడించారు. వీరిలో ప్రధాన నిందితులపై తిరుపతి, శ్రీకాకుళం, విశాఖల్లో పలు కేసులు నమోదుకాగా, బాధితుడిపై కూడా విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో మోసాలకు పాల్పడిన కేసులున్నాయి. వివరాల్లోకి వెళితే... గతంలో తిరుపతిలో రైస్‌పుల్లింగ్‌ కాయిన్‌ పేరిట మోసాలకు పాల్పడిన కేసులో నిందితుడైన గుంటూరు జిల్లాకు చెందిన పల్లపు ప్రసాద్‌ అలియాస్‌ కర్నాట ప్రసాద్‌ గత నెల 25న కుటుంబ సభ్యులతో పాటు విశాఖ వచ్చి పి.రామిరెడ్డి అలియాస్‌ ప్రతాపరెడ్డిని కలుసుకున్నాడు. ప్రతాపరెడ్డిపై శ్రీకాకుళం, విశాఖల్లో మోసాలకు పాల్పడిన కేసులు సుమారు 4 వరకు నమోదయ్యాయి. ప్రతాపరెడ్డి, పల్లపు ప్రసాద్‌ కలిసి గతంలో పలు రకాల మోసాలకు పాల్పడ్డారు. ఎవరినైనా అపహరణ చేసి డబ్బులు సంపాదించాలని మళ్లీ యోచించారు. మోసాలకు పాల్పడిన వ్యక్తుల్ని బెదిరించి దోచుకుంటే ఎలాంటి కేసులు ఉండవని భావించి గతంలో శ్రీకాకుళంలో ప్రతాపరెడ్డితో పాటు కేసుల్లో ఇరుక్కున్న జామి సురేష్‌ని లక్ష్యంగా చేసుకున్నారు. జామి సురేష్‌ ప్రస్తుతం విశాఖ కేంద్రంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం నిర్వహిస్తున్నాడు.

●*గతంలో ఓసారి పల్లపు ప్రసాద్‌ కిడ్నాపై డబ్బులు ఇచ్చి బయటపడ్డాడు. దీనిపై అతడు ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. ఇలా మోసాలకు పాల్పడే వారితో ఎలాంటి ఫిర్యాదులు ఉండవని భావించి జామి సురేష్‌ కిడ్నాప్‌కి రెక్కీ నిర్వహించారు. జామి సురేష్‌ను ఉచ్చులోకి లాగే పన్నాగంలో భాగంగా మనందరం కలసి నకిలీ బంగారంతో మోసాలు చేద్దామంటూ జూన్‌ 29న ప్రతాపరెడ్డి, పల్లపు ప్రసాద్‌లు అతడిని కలిసి వివరించారు. దీనికోసం ఖర్చు పెట్టడానికి అతడి వద్ద ఉన్న సొమ్ముల గురించి ఆరా తీశారు. గురి కుదిరాక సురేష్‌ కిడ్నాప్‌ కోసం హైదరాబాద్‌కు చెందిన నలుగురు స్నేహితులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నెల 4న రెక్కీ చేసి 5న మధ్యాహ్నం విశాఖలోని డీఆర్‌ఎం కార్యాలయం వద్ద కారులో అడ్వకేట్‌ శర్మతో ఉన్న జామి సురేష్‌ను కిడ్నాప్‌ చేసి పరవాడలోని ఒక విల్లాకు తీసుకువెళ్లి రూ.5 కోట్లు ఇవ్వాలంటూ కొట్టారు. అంత మొత్తం ఇవ్వలేనంటూ రూ.30 లక్షలకు సురేష్‌ బేరం కుదుర్చుకున్నాడు. ఈ మొత్తం కూడా బంగారం తనఖా పెట్టి ఇవ్వటానికి సిద్దమయ్యాడు. ఈ నెల 6న ఉదయం సురేష్‌ భార్య బంగారం తాకట్టు పెట్టేందుకు ఓ ప్రైవేటు బ్యాంకుకు వెళ్లగా అతడినీ అక్కడకు వాహనంలో తీసుకువచ్చి ఆమెకు ఫోన్‌ చేయించారు. ఈ సమయంలో వాగ్వాదం చోటుచేసుకోవడంతో సురేష్‌ కుమారుడు 100కి సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోవటంతో సురేష్‌ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. అతడు నాల్గో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

●*●డీసీపీ ఐశ్వర్యరస్తోగి, ఏసీపీ కులశేఖర్‌ల సారథ్యంలో సి.ఐ.ప్రేమ్‌కుమార్‌, ఎస్‌.ఐ.లు శ్రీనివాసరావు, సూర్యనారాయణ, నర్సింగరావు, కానిస్టేబుల్‌ రమేష్‌, విజయ్‌, శివకుమార్‌ తదితరులతో కూడిన పలు బృందాలను ఏర్పాటుచేశారు.

●*●పల్లపు ప్రసాద్‌ను ఒంగోలులో, ప్రతాపరెడ్డిని విశాఖలో అరెస్టు చేశారు. వీరికి సహాయ సహకారాలు అందించిన నలుగురు పరారీలో ఉన్నారు.

●*●కేవలం 72 గంటల్లో కేసు ఛేదించిన సిబ్బందికి సీపీ ఆర్కే మీనా, డీసీపీ ఐశ్వర్య రస్తోగిల చేతుల మీదుగా నగదు ప్రోత్సాహకాలు అందించి, అభినందించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.