close

శనివారం, జనవరి 25, 2020

తాజా వార్తలు

తెలుగువర్సిటీ సాహితీ పురస్కారాల ప్రదానం

నారాయణగూడ, న్యూస్‌టుడే: వచ్చే జనవరి (2020) నుంచి ‘డాక్టర్‌ ఆఫ్‌ లెటర్స్‌’ (డి.లిట్‌) కోర్సును ప్రవేశ పెట్టాలని శుక్రవారం జరిగిన వర్సిటీ విద్యాత్మక నిర్వహణ సంఘం సమావేశంలో నిర్ణయించినట్లుగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య ఎస్వీ సత్యనారాయణ వెల్లడించారు. 2017 సంవత్సరానికిగాను తెలుగు సాహిత్యంలో వివిధ ప్రక్రియల్లో వెలువడిన ఉత్తమ గ్రంథాలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారాలను శుక్రవారం వర్సిటీలోని ఎన్టీఆర్‌ కళామందిరంలో ప్రదానం చేశారు. వర్సిటీ ఉపాధ్యక్షులు ఆచార్య ఎస్వీ సత్యనారాయణ పదకొండు మంది సాహితీవేత్తలను రూ.20,116 (ఒకొక్కకరికి) నగదు, ప్రశంసా పత్రం, శాలువాతో సత్కరించి మాట్లాడారు. ఈ సాహిత్య పురస్కారాల కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు నాలుగు వందలకుపైగా వివిధ ప్రక్రియల్లో పరిశీలనకు వచ్చాయని, న్యాయనిర్ణేతల ఎంపిక సంఘం వాటిని వివిధ దశల్లో వడబోసి ఉత్తమ గ్రంథాలను ప్రకటించిందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య అలేఖ్య పుంజాల స్వాగతం పలికారు.

పురస్కార గ్రహీతలు వీరే... 
పద్యకవితా ప్రక్రియలో మాల్యశ్రీ (చింతలూరి మల్లయ్య) రచించిన ‘మన్యభారతం’, వచనా కవితాలో నారాయణ స్వామి రచన ‘వానోస్తద..?’, గేయ కవిత్వంలో తుమ్మూరి రామమోహన్‌రావు రచన ‘ఎలకోయిల పాట’ సాహితీ పురస్కారాలను అందజేశారు. బాలసాహిత్యంలో కొల్లూరు స్వరాజ్యం రమణమ్మ రచన ‘అనగ అనగా పిల్లల కథలు’కు, కథానికలో బి.మురళీధర్‌ రచన ‘నెమలినార’, కథా సంపుటి, నవలా ప్రక్రియలో భూతం ముత్యాలు రచన ‘మొగలి’కి, నవల, సాహిత్య విమర్శలో అటాత్ట వెంకటరామిరెడ్డి రచన ‘శైలీ శిల్పం వెయ్యేళ్ల తెలుగు కవిత్వం’కు పురుస్కారాలిచ్చారు. నాటకం/నాటిక ప్రక్రియల్లో భారతుల రామకృష్ణ రచించిన ‘సప్త సౌరభాలు’కు, అనువాదంలో మెహక్‌ హైదరాబాదీ రచించిన ‘గుప్పిట జారే ఇసుక’కు, వచన రచన విభాగంలో కోవెల సంతోష్‌కుమార్‌ రచన ‘దేవ రహాస్యం’, రచయిత్రి ఉత్తమ గ్రంథం విభాగంలో జూపాక సుభద్ర రచించిన ‘రాయక్క మాన్యం’ గ్రంథాలకు సాహిత్య పురస్కారాలను ప్రదానం చేశారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.