close
Updated : 19/08/2021 21:05 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

అలా ఇప్పుడు వండర్ ‘మామ్’ అయింది!

(Photo: Instagram)

చంటి బిడ్డ ఆకలి తీర్చడం తల్లి ప్రథమ కర్తవ్యం... అది ఎక్కడైనా, ఎప్పుడైనా సరే! అయితే ఇంట్లో నాలుగ్గోడల మధ్య స్వేచ్ఛగా తమ చిన్నారులకు పాలిచ్చే తల్లులు.. నలుగురిలోకి వచ్చేసరికి మాత్రం మొహమాటపడుతుంటారు. చుట్టూ ఉన్న వాళ్ల వెకిలి చూపులు వాళ్లను ఇబ్బందికి గురి చేయడమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పాలి. ఈ క్రమంలోనే ఒక తల్లి తన బిడ్డను తీసుకుని బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు.. అక్కడ బిడ్డకు పాలిచ్చే సౌకర్యం ఉంటుందో, ఉండదో అని ముందుగానే బిడ్డకు పాలు పట్టాల్సి వస్తోంది.

సూపర్‌ మామ్!

అయితే ఎవరేమనుకున్నా, ఎవరెలాంటి దృష్టితో చూసినా ఇంటా బయటా తల్లులు చిన్నారులకు పాలివ్వడానికి అస్సలు వెనకాడకూడదంటున్నారు కొందరు తారామణులు. కేవలం చెప్పడమే కాదు.. చేసి చూపించారు కూడా! తాజాగా హాలీవుడ్‌ నటి, ‘వండర్‌వుమన్‌’ గాల్‌ గడోట్‌ షూటింగ్‌ మేకప్‌ సమయంలో తన పిల్లాడి కోసం చనుబాలను ఓ సీసాలోకి పడుతూ కనిపించింది. ఆ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. హాలీవుడ్‌ ప్రముఖులతో పాటు నెటిజన్లు ఆమెను ‘సూపర్‌ మామ్‌’, ‘గ్రేట్‌ మామ్‌’ అంటూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

గాల్‌ గడోట్... ఈ పేరు చెబితే చాలామందికి ఆమె తెలియకపోవచ్చు. కానీ ‘వండర్‌ వుమన్‌’ అనగానే అందరికీ ఆమె రూపం కళ్ల ముందు మెదులుతుంది. ఇదే కాదు...‘బ్యాట్మ్యాన్‌ వర్సెస్‌ సూపర్‌ మ్యాన్‌: డాన్‌ ఆఫ్‌ జస్టిస్‌’, ‘జస్టిస్ లీగ్‌’ చిత్రాల్లోనూ డయానా ప్రిన్స్‌/ వండర్‌ వుమన్‌గా అభినయించి ఎందరో అభిమానులను సంపాదించుకుందీ అందాల తార. సినిమాల్లో సాహసోపేతమైన స్టంట్స్‌తో ఆకట్టుకునే గడోట్‌ నిజ జీవితంలోనూ అంతే ముక్కుసూటిగా వ్యవహరి స్తుంది. లింగ సమానత్వం, స్త్రీల హక్కులు వంటి సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటుంది.

అమ్మగా నా బాధ్యత!

2008లో జారన్‌ వర్సానోను వివాహం చేసుకున్న గడోట్‌ ఈ ఏడాది జూన్‌లో మూడోసారి మళ్లీ తల్లయింది. అంతకుముందు ఆమె ఇద్దరు అమ్మాయిలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ముగ్గురు పిల్లల పెంపకంలో అమ్మతనాన్ని అస్వాదిస్తోన్న గడోట్‌ ఇటీవల ఓ షూటింగ్‌కు హాజరైంది. అక్కడ మేకప్‌ ఆర్టిస్టులు తనను రడీ చేస్తుండగా పిల్లాడి కోసం తన చనుబాలను ఓ సీసాలోకి పడుతూ కనిపించింది. అనంతరం ఆ ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ ‘తెర వెనుక నేను... అమ్మగా నా బాధ్యత’ అనే క్యాప్షన్‌ను జత చేసింది.

వండర్‌ ‘మామ్’!

ఓవైపు నటిగా తన వృత్తికి న్యాయం చేస్తూనే...మరోవైపు తల్లిగా తన బాధ్యతలు నిర్వర్తించిన గడోట్‌ను మెచ్చుకుంటూ పలువురు ప్రముఖులు, నెటిజన్లు సానుకూలంగా స్పందించారు. ‘సూపర్‌ మామ్‌’, ‘గ్రేట్‌ మదర్‌’ అంటూ కామెంట్ల వర్షం కురిపించారు.

వీరు కూడా!

తల్లి పాలు పట్టడమనేది మన హక్కు...అందరూ దాన్ని ప్రోత్సహించాలన్న సందేశాన్నిస్తూ గతంలో కూడా కొందరు అందాల తారలు తమ బ్రెస్ట్‌ ఫీడింగ్‌ స్టోరీస్‌ను పంచుకున్నారు. నేటి తల్లుల్లో స్ఫూర్తి నింపారు.
B0p1tXInj46

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని