close
Updated : 07/09/2021 05:27 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

సంతోషాలకు సప్తపది!

భార్యాభర్తలు పాలూ నీళ్లలా కలిసిపోవాలి. ఒకరి నొకరు అర్థం చేసుకోవాలి. ఎదుటి వారిని గౌరవించాలి. చెప్పేది పూర్తిగా వినాలి. అప్పుడే కాపురం కలతలు లేకుండా సాగుతుంది. అందమైన బంధంలోకి అడుగుపెట్టిన జంటకు మరికొన్ని మార్గదర్శకాలు...

1 మీరు ఎంత బిజీగా ఉన్నా ఒకరికొకరు సమయాన్ని కేటాయించుకోవాలి. రోజులో కొన్ని పనులు కలిసి చేసే, కలిసి ఉండేలా ప్లాన్‌ చేసుకోవాలి. అప్పుడే జీవితం ఆనందమయం అవుతుంది.

2 వీలైనంతవరకూ రోజులో ఎక్కువసార్లు భాగస్వామికి మీ ప్రేమను చేతల్లో చూపండి. పనుల్లో సాయం చేయడం, ఇద్దరూ పనులు పంచుకోవడం, తనకిష్టమైనవి చేయడం... లాంటివన్న మాట.

3 మీ భావాలను ఎదుటివారితో పంచుకోవాలి. సంతోషం, దుఃఖం, బాధ... ఇలా ప్రతిదీ షేర్‌ చేసుకోవాలి.

4  ఒకరికోసం మరొకరు అన్నట్లుగా ఉండాలి.  ఎదుటివారి కోసం కొన్ని వదులుకోవడానికి, మరికొన్ని నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలి.

5  భాగస్వామిపై చెప్పలేనంత ప్రేమ ఉన్నా తనకంటూ కొంత సమయం/స్పేస్‌ను ఇవ్వాలి. ఆలుమగలన్నాక అప్పుడప్పుడు చిరు గొడవలు సహజమే... అయితే వాటిని చిన్నగా ఉన్నప్పుడే పరిష్కరించుకోవాలి. అంతే తప్ప మేమే గొప్ప అనే అహాన్ని ఇరువురూ ప్రదర్శించకూడదు. ఇలా చేస్తే సున్నితమైన మీ బంధం క్రమంగా బలహీనపడే ప్రమాదం ఉంది.

6  ఇతరులతో ఎప్పుడూ పోల్చొద్దు. ఉన్నంతలో సంతోషంగా, కలహాలు, కలతలు లేకుండా ఉండేందుకు ఇద్దరూ కృషి చేయాలి.

7  భాగస్వామి కోసం అప్పుడప్పుడు సర్‌ప్రైజ్‌లను ప్లాన్‌ చేయాలి. ఆ సమయంలో ఎదుటి వారి కళ్లలోని ఆశ్చర్యానందాలను మీరెప్పటికీ మరిచిపోలేరు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని