close
Updated : 05/06/2021 20:02 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

కూరల ఘుమఘుమలకు..!

శాకాహారం, మాంసాహారం... ఏదైనా ఘుమఘుమ లాడాలంటే మసాలాలు దట్టించాల్సిందే! అయితే వాటిని నిల్వ చేయడంలో కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. అవేంటంటే!
దాల్చినచెక్క, లవంగం, ధనియాలు, జీలకర్ర... ఏ మసాలాలయినా గాలి చొరని గాజు సీసాల్లో . ప్యాకెట్లు చింపి గాలికి వదిలేస్తే... తేమ చేరి బూజు పడుతుంది. ఘాటైన వాసనలూ పోతాయి. ఫలితంగా వంటకాల్లో వాడినప్పుడు రుచిని కూడా క్రమంగా కోల్పోతాయి.  
* దినుసుల్ని నూనె లేకుండా వేటికవే దోరగా వేయించుకుని... అప్పుడు పొడి కొట్టుకుంటే మంచి పరిమళం ఉంటుంది. ఎండుమిర్చీ, ధనియాలూ, సోంపూ, కరివేపాకూ, జీలకర్ర వంటివాటినీ విడిగా దోరగా వేయించుకుని తర్వాత తగుపాళ్లలో కలిపి మసాలాపొడిలో కలుపుకోవాలి. ఆ కొట్టిన మసాలాపొడిని కూడా గాజు సీసాలోనో, చిన్నజాడీలోనో వేసుకుంటే మంచిది.
* కాసిన్ని ధనియాలూ, కొద్దిగా ఎండుమిర్చీ, జీలకర్ర కలిపి వేయించి పొడి చేసిపెట్టుకోండి. మీ పని సులువవుతుంది. ఈ పొడి చల్లితే వేపుళ్లు సువాసన వస్తాయి. ఈ మిశ్రమానికి కాస్త మిరియాల పొడిచేర్చి చాట్‌ మసాలాలా వాడుకోవచ్చు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని