close
Updated : 14/03/2021 15:48 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

ఆలుతో అన్నీ శుభ్రం!

ఫ్రెంచ్‌ఫ్రైస్‌, దమ్‌ ఆలూ, ఆలూ పరాఠా, ఆలూ బటర్‌... ఇలా బంగాళాదుంపతో చేసిన ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. అయితే ఆలుగడ్డ కేవలం రుచులను పంచడం మాత్రమే కాదు. వస్తువులను శుభ్రం చేయడంలోనూ ముందుంటుంది. ఈ దుంపను ఉపయోగించి ఇంట్లో వస్తువులను ఎలా మెరిపించొచ్చో తెలుసుకుందామా...
తుప్పును తొలగిస్తుంది...  చాకులు, కత్తెరలు, కడాయిల శుభ్రత, నిర్వహణ విషయంలో కాస్త అశ్రద్ధ చేస్తే తుప్పు పడతాయి. దీన్ని తొలగించడానికి బంగాళాదుంప బాగా పనిచేస్తుంది. అర ముక్క ఆలుగడ్డపై  కాస్తంత వంటసోడా, డిష్‌వాష్‌ సోప్‌ వేసి రుద్దితే తుప్పు వదిలిపోతుంది. ఆ తర్వాత నీటితో కడిగి ఆరబెడితే సరి.
వెండి వస్తువులను మెరిపిస్తుంది... ఈ దుంపలను ఉడికించిన నీటితో వెండి వస్తువులను శుభ్రం చేస్తే తళతళా మెరుస్తాయి. ఆ నీటిలో వాటిని గంటసేపు నానబెట్టాలి. ఆలులోని పిండిపదార్థం వాటిపై పేరుకున్న మురికిని తొలగిస్తుంది.
మరకలు పోగొడుతుంది... దుస్తులపై పడిన గ్రీజు లాంటి మొండి మరకలను బంగాళాదుంప ముక్క చక్కగా పోగొడుతుంది. అయితే మరకపోయే వరకు ఓపికగా రుద్దాల్సిందే.
అద్దాలు మెరిసేలా... దుమ్ము, ధూళి, పొగతో మసకబారిన కిటికీ అద్దాలను మెరిపించాలంటే పొటాటోకు పని చెప్పాల్సిందే. సగంముక్కతో అద్దంపై రుద్దాలి. కాసేపటి తర్వాత శుభ్రమైన వస్త్రంతో తుడిస్తే అవి తళతళా మెరుస్తాయి.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని