close
Updated : 20/03/2021 06:20 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

అందానికి గంధం పూత!

ఈ కాలంలో వేడికి ముఖం కందిపోతుంటుంది. ఎక్కువగా చెమటలు పట్టి చర్మం పొడిబారిపోతుంది కూడా. ఇలాంటప్పుడు ముఖానికి గంధం పూత వేసుకుంటే ఎంతో హాయిగా ఉంటుంది.
దీన్నెలా చేయాలంటే... రెండు చెంచాల గంధం పొడిలో కొంచెం గులాబీ నీరు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.. బాగా ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేసుకోవాలి.
లాభాలెన్నో.. ఈ పూత మొటిమలు, మచ్చలను మాయం చేస్తుంది. దీంట్లోని యాంటీఆక్సిడెంట్లు చర్మంపై ముడతలు రానీయకుండా పరిరక్షిస్తాయి. అంతేకాదు ఫ్రీరాడికల్స్‌తో పోరాడి చర్మాన్ని సంరక్షిస్తాయి. ముఖానికి పట్టిన టాన్‌ను తొలగించడానికీ ఈ పూత ఎంతో సాయపడుతుంది.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని