close
Published : 04/04/2021 02:48 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

ఖర్జూరా.. పోషకాల ఖజానా!

ఖర్జూరాలను తీసుకోవడం వల్ల చాలా లాభాలున్నాయి. వీటిలో  కొలెస్ట్రాల్‌ ఉండదు. కొవ్వు శాతం కూడా తక్కువే. పైగా తక్షణ శక్తి లభిస్తుంది. ఇంకెలా మేలు చేస్తాయంటే..
* విటమిన్లూ, ఖనిజాలూ, మాంసకృత్తులూ ఖర్జూరాల్లో సమృద్ధిగా ఉంటాయి. వీటిలోని గ్లూకోజ్‌, సుక్రోజ్‌, ఫ్రక్టోజ్‌ల వల్ల తక్షణ శక్తి వస్తుంది. అలసట మాయమవుతుంది. వీటిని పాలతో కలిపి తీసుకుంటే మేలు.  
* వీటిలో పొటాషియం, క్యాల్షియం ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి ఎముకలకు మేలుచేస్తాయి. వీటిలోని పీచు అరుగుదలకు సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఖర్జూరాలు ముందుంటాయి.
* ఎండు ఖర్జూరాలను రాత్రంతా నానబెట్టి ఉదయం పండ్లతోపాటు తీసుకుంటే మలబద్ధకం సమస్య దరిచేరదు. బరువు పెరగాలనుకునే వారికి చక్కటి ఆహారం. వీటిలో ఇనుము శాతం కూడా ఎక్కువే. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తహీనత రాదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని