close
Published : 17/04/2021 01:20 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

ఉదయాన్నే మజ్జిగ తాగండి..

వేసవి తాపాన్ని తగ్గించే వాటిల్లో మజ్జిగ ముందుంటుంది. అంతేకాదు బరువును నియంత్రణలో ఉంచుతూ కడుపును చల్లబరుస్తుంది. ఇంకా మజ్జిగ తాగితే ఏమేం ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం రండి..

మజ్జిగలో పొటాషియం, క్యాల్షియం, విటమిన్‌ బి కాంప్లెక్స్‌ వంటి పోషకాలు ఎక్కువ. రోజూ ఉదయాన్నే ఓ గ్లాసు తీసుకుంటే కావల్సిన శక్తి అందుతుంది. మజ్జిగలో కెలొరీలు, కొవ్వు శాతం తక్కువ కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు తాగితే మంచిది.
మజ్జిగలో కొద్దిగా అల్లం రసం కలిపి తాగితే అతిసారం తగ్గుతుంది. దీనిలోని లాక్టోజ్‌, కార్బోహైడ్రేట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అదే పటిక బెల్లంతో కలిపి తీసుకుంటే పైత్యం తగ్గుతుంది.  
దీన్ని తాగడం వల్ల జీర్ణాశయం, పేగుల్లో ఉండే హానికర బ్యాక్టీరియా నశించి మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీంతో జీర్ణాశయ సమస్యలు రావు. అంతేకాక మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్‌ సమస్యలు తగ్గిపోతాయి.
ఎండాకాలంలో వచ్చే డీహైడ్రేషన్‌ సమస్య తగ్గాలంటే మజ్జిగ తాగితే సరి. అధిక రక్తపోటు ఉన్నవారు రోజూ ఉదయం ఉప్పు లేకుండా మజ్జిగ తాగితే రక్తపోటు అదుపులోకి వస్తుంది.

వేసవిలో వెజిటెబుల్‌ సలాడ్‌ తీసుకోవడం మేలు. అది కీరదోసతో చేసినదైతే మరీ

మంచిది. దీనిలో నీరుశాతం ఎక్కువగా ఉండి, శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని