close
Published : 22/04/2021 00:28 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

మాట పొదుపుగా...!

మనసుల్ని కలపాలన్నా, దూరం చేయాలన్నా...ఆ శక్తి మాటకి మాత్రమే ఉంది. ఆలుమగల అనుబంధంలో ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే...
జీవితంలో పొరబాట్లు జరుగుతూనే ఉంటాయి. వాటిని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఇద్దరి మీదా ఉంటుంది. అలాకాకుండా తప్పెప్పుడూ ఎదుటివారిదే ఉంటుందన్నట్లు సూటిమాటలు మాట్లాడటం సరికాదు. దీనివల్ల అసలు విషయం పక్కకెళ్లి వాదనలు మొదలవుతాయి. ఒకవేళ అవతలివారే పొరబాటు చేశారన్నా కూడా...సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలి.
* పెళ్లి అనే బంధంతో ఒక్కటయిన భార్యాభర్తల అభిప్రాయాలూ వేర్వేరు కావొచ్చు. కానీ అవతలివారు చెప్పేదాన్ని పూర్తిగా విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. లేదంటే...మీరెలా అపార్థం చేసుకుంటారోనని చెప్పడమే మానేయొచ్చు. దీనివల్ల ఇద్దరి మధ్యా ఒకలాంటి నిస్తేజం ఆవరిస్తుంది. మనసులోని మాటను స్పష్టంగా చెబితే ఇలాంటి అసంతృప్తులకు దూరంగా ఉండవచ్చు.
* కొంతమంది సహజంగానే దురుసుగా మాట్లాడుతుంటారు. నలుగురిలోనూ ఇలా మాట్లాడే మాటలు మీ భాగస్వామి మనసుని నొప్పించొచ్చు. క్రమంగా మీ మధ్య దూరం పెరగడానికి ఇదే కారణం కావొచ్చు. అందుకే ఈ పరిస్థితి అడ్డుకట్ట వేయడానికి అభిప్రాయాల్ని చెప్పాల్సి వచ్చినప్పుడు ఓ పుస్తకంలోనో, చీటీలోనో రాయడం అలవాటు చేసుకోండి. దీనివల్ల క్రమంగా మీ క్షణికావేశాన్ని తగ్గించుకోగలుగుతారు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని