close
Published : 03/05/2021 00:38 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

నఖ సౌందర్యానికి నువ్వుల నూనె

అందంగా కనిపించాలని చర్మం, జుట్టుపై చూపించే శ్రద్ధ గోళ్లపైనా చూపించండి. తగిన పోషకాహారం తీసుకుంటూనే ఈ జాగ్రత్తలూ పాటిస్తే మేలు..

* తరచూ గోళ్లు విరిగిపోతుంటే.. ఆముదం వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు గోళ్లకు రాసి మృదువుగా మర్దన చేయాలి. ఇలా రోజుకి ఒకసారైనా చేస్తుంటే విరిగిపోకుండా ఉంటాయి.
* కొబ్బరి నూనె వేడిచేసి దానికి రెండు చెంచాల తేనె కలపాలి. ఈ మిశ్రమంలో కనీసం పది నిమిషాలైనా గోళ్లను నాననిచ్చి ఆపై మృదువుగా మర్దన చేయాలి. వారానికి రెండుసార్లు ఈ చిట్కాను పాటిస్తుంటే వాటికి రక్తప్రసరణ అందుతుంది. పెళుసుబారే సమస్య తగ్గుతుంది.
* మూడు చెంచాల నువ్వులనూనెలో చెంచా నిమ్మరసం కలిపి అవెన్‌లో వేడి చేయాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు పదినిమిషాల పాటు వేళ్లని అందులో ఉంచాలి. చివరగా ఓ రెండు మూడు నిమిషాలు మర్దనా చేయాలి. తరచూ ఇలా చేస్తుంటే గోళ్లు ఆరోగ్యంగా, అందంగా ఉంటాయి.


ఈ కాలంలో తాగే నీటిలో కొన్ని పుదీనా ఆకులు వేసుకుంటే శరీరం చల్లగా ఉంటుంది. అలానే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియంట్లు, మెంథాల్‌...ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చూస్తాయి.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని