ఆ రాష్ట్రంలో 106 మంది చిన్నారులకు కరోనా..!

తాజా వార్తలు

Updated : 06/07/2021 20:19 IST

ఆ రాష్ట్రంలో 106 మంది చిన్నారులకు కరోనా..!

ఐజ్వాల్: మిజోరంలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గడిచిన 24 గంటల్లో అక్కడ కొత్తగా 520 మందికి వైరస్‌ సోకింది. అయితే వారిలో 106 మంది చిన్నారులు కావడం గమనార్హం. దీంతో ఆ రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 21,854కి చేరినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. తాజాగా ముగ్గురు చనిపోవడంతో మరణాల సంఖ్య 98కి చేరినట్లు పేర్కొన్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో ఐజ్వాల్ జిల్లా నుంచి 353, కొలాసిబ్‌ నుంచి 76, లుంగ్లీ నుంచి 50 మందికి వైరస్‌ సోకినట్లు వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,730 క్రయాశీల కేసులుండగా ఇప్పటివరకు 18,026 మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నాటికి 5.4 లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.  

 

   
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని