Cobra Snakes: ఆ ఇంట్లో 22 కోబ్రా పాము పిల్లలు

తాజా వార్తలు

Published : 01/08/2021 01:00 IST

Cobra Snakes: ఆ ఇంట్లో 22 కోబ్రా పాము పిల్లలు

ముంబయి: మన ఎదురుగా పాము కనిపిస్తేనే ప్రాణభయంతో పరుగులు తీస్తాం. అలాంటిది ఒకటి, రెండు కాదు.. ఏకంగా 22 కోబ్రా పాము పిల్లలు ఒకే ఇంట్లో కనిపిస్తే ప్రాణాలు పైనే పోయినట్లు అనిపిస్తుంది. స్థానికులను హడలెత్తించిన ఈ ఘటన మహారాష్ట్రలోని అమరావతి జిల్లా ఉత్తమ్సర గ్రామంలో చోటు చేసుకుంది.

మంగేష్ అనే వ్యక్తి ఇటీవల ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు. తిరిగివచ్చిన తర్వాతి రోజు సాయంత్రం పడక గదిలో కోబ్రా పాము కనిపించింది. పాములు పట్టే వ్యక్తిని రప్పించి దాన్ని బంధించారు. హమ్మయ్యా.. అనుకునేలోపే మరుసటి రోజు, ఆ తర్వాతి రోజు.. ఇలా వరుసగా పాము పిల్లలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇక లాభం లేదనుకుని పాములు పట్టే వ్యక్తితో ఇళ్లంతా వెతికించారు. దీంతో మొత్తం 22 కోబ్రా పాము పిల్లలు బయటపడ్డాయి. వాటిని చూసిన కుటుంబసభ్యులు భయంతో వణికిపోయారు. చిన్న పిల్లలు కావడంతో ఆ పాములను చంపకుండా బకెట్‌లో వేసి జనావాసాలకు దూరంగా వదిలిపెట్టారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని