21ఏళ్ల కుర్రాడితో వివాహానికి సిద్ధమైన 45ఏళ్ల మహిళ

తాజా వార్తలు

Published : 12/07/2021 01:11 IST

21ఏళ్ల కుర్రాడితో వివాహానికి సిద్ధమైన 45ఏళ్ల మహిళ

భిండ్: ప్రియుడి వ్యామోహంతో తన ఐదుగురు కుమార్తెలను ఇంట్లో నుంచి గెంటేసిన ఓ మహిళ నాలుగో వివాహానికి సిద్ధమైన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. భిండ్ జిల్లా ఝాన్సీ మొహల్లా గ్రామానికి చెందిన 45 ఏళ్ల మహిళ.. మిథున్ అనే 21 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది. చాలాకాలం పాటు వారు సహజీవనం కూడా చేశారు. అయితే ఈ వ్యవహారాన్ని ఆమె కుమార్తెలు మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చారు. ఈ క్రమంలో.. రెండో కుమార్తెను ఏడాది క్రితమే ఇంట్లో నుంచి తరిమేసింది. ప్రస్తుతం ఆ యువకుడితో వివాహానికి సిద్ధమైంది. ఈ వివాహానికి అడ్డు చెబుతున్న నలుగురు కుమార్తెలను బయటకు పంపేసింది. తల్లి వ్యవహారశైలి నచ్చని ఆమె కుమార్తెలు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదుతో సదరు మహిళను స్టేషన్‌కు తీసుకొచ్చిన పోలీసులు.. ఆమె ప్రియుడ్ని కూడా పిలిచి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. పోలీసులు ఇచ్చిన కౌన్సెలింగ్‌తో ప్రియుడు ఆమెతో పెళ్లికి నిరాకరించాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని