అమెజాన్‌లో ఫిట్‌నెస్‌ ఫెస్ట్‌ ఆఫర్లు

తాజా వార్తలు

Updated : 27/12/2020 04:27 IST

అమెజాన్‌లో ఫిట్‌నెస్‌ ఫెస్ట్‌ ఆఫర్లు

ఫిట్‌నెస్‌ ఉపకరణాలపై భారీ తగ్గింపు


దిల్లీ: ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ కొత్త ఆఫర్లతో ముందుకొచ్చింది. ‘హెల్త్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ ఫెస్ట్‌’ పేరిట వ్యాయామ ఉపకరణాలపై భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. నూతన సంవత్సరం దగ్గర పడనున్న నేపథ్యంలో ప్రజలంతా ‘ న్యూఇయర్‌ రిజల్యూషన్స్‌’లో భాగంగా ఫిట్‌నెస్‌పై దృష్టిసారించే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాయామ సంబంధిత ఉపకరణాలపై ఈ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లు జనవరి 2, 2021 వరకు అందుబాటులో ఉండనున్నాయి. ఫిట్‌నెస్‌ ట్రాకర్లు, స్మార్ట్‌ వాచ్‌లు, ఆరోగ్య సంబంధిత ఉపకరణాలు అందుబాలులో ఉన్నాయి. ఓఎల్‌ఈడీ కలర్‌ డిస్‌ప్లే ఉన్న జీవోక్యూఐఐ వైటల్‌ 3.0 బాడీ టెంపరేచర్‌ ట్రాకర్‌ రూ. 3,960కి లభించనుంది. గార్మిన్‌ వివో యాక్టివ్‌ 3 జీపీఎస్‌ స్మార్ట్‌ వాచ్‌ రూ.22,990కు అందుబాటులో ఉంచింది. ఎమ్‌ఐ స్మార్ట్‌బాండ్‌ 5 రూ.2,499కు లభించనుంది. అమేజ్‌ఫిట్‌ బీఐపీ యూ స్మార్ట్‌ వాచ్‌ రూ.3,999కు, ఫాజిల్‌ జెన్‌5 స్మార్ట్‌ వాచ్‌ రూ. 22,995లకు, టైటాన్‌ కనెక్టెడ్‌ ఎక్స్‌ స్మార్ట్‌ వాచ్‌ రూ. 11,995లకు లభించనున్నాయి. కోకాటో మోటోరైజ్‌డ్‌ ట్రెడ్‌మిల్‌ రూ. 18,990ల ధరలో, గకోర్‌ 16-30కేజీ హోమ్‌ జిమ్‌ రూ. 1,499 ధరలో వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. ఇవేకాకుండి యోగా మ్యాట్‌లు, ఇయర్‌ఫోన్లును తక్కువ ధరకే అందిస్తోంది. 

ఇవీ చదవండి..

ఎన్డీయేకు మరో షాక్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని