జంతువులకూ.. క్రిస్మస్‌ విందు

తాజా వార్తలు

Published : 21/12/2020 23:52 IST

జంతువులకూ.. క్రిస్మస్‌ విందు

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రిస్మస్‌ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకోవడం సర్వసాధారణం. కరోనా కారణంగా ఈసారి సందడి తగ్గినప్పటికీ వేడుకలకు అన్ని దేశాలు సిద్ధమయ్యాయి. అయితే మనుషులకంటే జంతువులు తక్కువ కాదనుకున్న ఆస్ట్రేలియాలోని తరోంగా జంతు ప్రదర్శనశాల నిర్వాహకులు తమ జూలోని జంతువులకు క్రిస్మస్‌ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. క్రిస్మస్‌ వేడుకలను ముందస్తుగానే నిర్వహించారు. ఆఫ్రికన్‌ సింహాలు, జిరాఫీలు, మరికొన్ని జలచరాలకు ప్రత్యేక ఆహారం అందించారు. సీల్ జంతువులకు ఇష్టమైన చేపలను మేర్రీ క్రిస్‌మస్‌ ఆకారం వచ్చేలా ఐస్‌ గడ్డల్లో చేపలను అమర్చి అందించారు. ఆలివ్‌ కొమ్మల్లో ఆపిల్‌ ముక్కలను ఉంచి జిరాఫీ విందు ఇచ్చారు. వీటితోపాటు పలు జంతువులకు వాటికి ఇష్టమైన ఆహారం అందించారు. తరోంగా జంతుప్రదర్శనశాల మునుపెన్నడూ ఈ విధంగా ఏ పండగనూ జరపలేదని నిర్వాహకులు పేర్కొన్నారు. జంతువులన్నీ ఎంతో సంతోషంగా ఆహారాన్ని ఆరగించాయని వెల్లడించారు.

ఇవీ చదవండి...

68 ఏళ్ల మహిళ.. ఓ దీవీ.. రూ.25 లక్షలు

గూగుల్‌ డూడుల్‌లో ఖగోళ వింతలు
 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని