ఎమ్మెల్యే పెళ్లిపై స్పందించిన మద్రాసు హైకోర్టు

తాజా వార్తలు

Updated : 08/10/2020 18:32 IST

ఎమ్మెల్యే పెళ్లిపై స్పందించిన మద్రాసు హైకోర్టు

చెన్నై : తమిళనాడులో చర్చనీయాంశమైన అన్నాడీఎంకే ఎమ్మెల్యే ప్రేమ వివాహంపై మద్రాసు హైకోర్టు స్పందించింది. తన కూతురిని బెదిరించి పెళ్లి చేసుకున్న ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ఆమె తండ్రి మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఎమ్మెల్యే ప్రభు(34), సౌందర్య(19)లు శుక్రవారం కోర్టుకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. కళ్లకురిచ్చి నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన ప్రభు త్యాగదుర్గానికి చెందిన ఆలయ అర్చకుడు స్వామినాథన్‌ కుమార్తె సౌందర్యను సోమవారం ప్రేమపెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యువతి తండ్రి ఆత్మహత్యానికి యత్నించగా స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. తన కుమార్తెను అపహరించుకుపోయి ఎమ్మెల్యే పెళ్లి చేసుకున్నారని యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కులాలు వేరు కావటంతోనే యువతి తండ్రి స్వామినాథన్‌ పెళ్లిని వ్యతిరేకిస్తున్నారని ఎమ్మెల్యే తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు నిజం కాదని యువతి తండ్రి అన్నారు. తనకు కులం పట్టింపు లేదని వివరించిన యువతి తండ్రి.. తన కూతురికి ఎమ్మెల్యేకు మధ్య ఉన్న వయస్సు వ్యత్యాసం వల్లే ఈ పెళ్లికి అభ్యంతరం తెలుపుతున్నట్లు చెప్పారు. తన కూతురితో పెళ్లి చేయకపోతే తనను చంపేస్తానని ఎమ్మెల్యే బెదిరించారని స్వామినాథన్‌ అన్నారు. అయినా లొంగకపోవటంతో ఎమ్మెల్యే తన కూతురిని అపహరించుకుపోయి వివాహం చేసుకున్నట్లు ఆయన ఆరోపిస్తున్నారు. 

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని