అడ్డుకోవాల్సింది కరోనాను.. బాధితులను కాదు

తాజా వార్తలు

Published : 03/08/2020 22:42 IST

అడ్డుకోవాల్సింది కరోనాను.. బాధితులను కాదు

హైదరాబాద్‌: కరోనాను అడ్డుకోవాలి కానీ వైరస్‌ బాధితులను కాదని మంత్రి హరీష్‌రావు తెలిపారు. కేసీఆర్‌ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కరోనా నియంత్రణకు కృషి చేస్తోందని తెలిపారు. బేగంపేటలో జితో కొవిడ్‌కేర్‌ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. పేదల కోసం 100 పడకలు గల ఆసుపత్రిని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కరోనా వస్తే చనిపోతారనే అపోహ సరికాదని చెప్పారు. రాష్ట్రంలో 99శాతం మంది కరోనా నుంచి కోలుకుంటున్నారని హరీష్‌రావు వెల్లడించారు.

వేరే అనారోగ్య సమస్యలతో బాధపడే వారు, ఆసుపత్రుల్లో చేరడం ఆలస్యం చేసిన వారిలో కొంత మంది మృతి చెందుతున్నారని వివరించారు. కరోనా వచ్చిన వారిని ఊళ్లలోకి రావద్దనడం, అద్దె గదులు ఖాళీ చేయమనడం సరికాదన్నారు. కరోనా బాధితులకు సేవలు అందించడంలో శ్రద్ధ చూపాలని వైద్య సిబ్బందికి ఆయన సూచించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని