తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సచివాలయం

తాజా వార్తలు

Updated : 17/07/2020 19:19 IST

తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సచివాలయం

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రతిష్ఠను ఇనుమడించేలా సచివాలయం రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా సచివాలయం ఉంటుందని చెప్పారు. పరిపాలన కేంద్రానికి ఉండాల్సిన సదుపాయాలన్నీ సచివాలయానికి ఉండాలన్నారు. కొత్త సచివాలయ నిర్మాణంపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం, మంత్రులు, సీఎస్‌ విధులు నిర్వర్తించేలా సచివాలయం ఉండాలని చెప్పారు. గతంలో మాదిరిగా అక్కడొకరు, ఇక్కడొకరు ఉండొద్దని అన్నారు.‘‘మంత్రులు, కార్యదర్శులు ఒకే చోట ఉండాలి. శాఖల విభాగాధిపతులకు సచివాలయం వద్దే కార్యాలయ సముదాయం కూడా నిర్మిస్తాం.అప్పుడు ప్రభుత్వ యంత్రాంగమంతా ఒకే దగ్గర ఉంటుంది’’ అని కేసీఆర్‌ చెప్పారు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని