కీలక శాఖలతో చర్చించనున్న కేసీఆర్‌

తాజా వార్తలు

Published : 19/07/2020 13:51 IST

కీలక శాఖలతో చర్చించనున్న కేసీఆర్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలోని రెండు కీలకమైన ఇంజినీరింగ్‌ విభాగాల ముఖ్యులతో సీఎం కేసీఆర్‌ సోమ, మంగళ వారాల్లో సమీక్షలు నిర్వహించనున్నారు. సోమవారం  నీటిపారుదలశాఖ పునర్వ్యవస్థీకరణ ముసాయిదాపై సీఎం సమగ్రంగా  చర్చించి తుదినిర్ణయం తీసుకోనున్నారు. మంగళవారం మధ్యాహ్నం సచివాలయం భవన నిర్మాణంపై సమీక్షిస్తారు. ఈ సమావేశంలో తమిళనాడు ఆర్కిటెక్టులు ఆస్కార్‌, పొన్ని పాల్గొననున్నారు. సచివాలయ బాహ్యరూపం, సౌకర్యాలు తదితర అంశాలపై సమీక్షిస్తారు. అనంతరం వాటిని మంత్రివర్గంలో చర్చించి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. ఆ తర్వాత టెండర్లు పిలిచి భవన సముదాయ నిర్మాణాలను ప్రారంభించనుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని