టిప్పు రూ.3.68 లక్షలు..బిల్లు ఎంతో తెలుసా!

తాజా వార్తలు

Updated : 19/12/2020 00:23 IST

టిప్పు రూ.3.68 లక్షలు..బిల్లు ఎంతో తెలుసా!

వాషింగ్టన్‌: సరదాగా హోటల్‌కి వెళ్లి తిన్న తర్వాత వెయిటర్‌కి టిప్పు ఇవ్వాలంటే మనం కాస్త ఆలోచిస్తాం. ఒకవేళ ఇచ్చినా ఓ యాభై రూపాయల్లోపే ఉంటుంది. కొందరు ఇంకాస్త ఎక్కువ మొత్తాన్నే టిప్పుగా ఇస్తుంటారు. అలాంటి వాళ్లు ఒక్కరు దొరికినా ఆ రోజు వెయిటర్ల పంట పండినట్లే. తాజాగా.. అమెరికాలో ఓ మిత్రబృందం వెయిటర్‌కు ఏకంగా 5 వేల డాలర్లు (దాదాపు రూ. 3 లక్షల 68 వేలు) టిప్పుగా ఇచ్చారు. ఇంతకీ వారు తిన్న ఆహారానికి అయింది కేవలం 205 డాలర్లు (రూ.15 వేలు) మాత్రమే. 
 

పెన్సిల్వేనియాలోని ఓ రెస్టారెంట్‌లో జియానా డి ఏంజెలో అనే యువతి వెయిటర్‌గా పనిచేస్తోంది. ఈక్రమంలో ఓ మిత్ర బృందం రెస్టారెంట్‌కు వచ్చి, ఫుడ్‌ ఆర్డర్‌ చేసి తిన్నారు. ఇంతలో జియానా బిల్లు తీసుకొచ్చి టేబుల్‌ మీద పెట్టి వెళ్లింది. మళ్లీ వచ్చి చూసే సరికి బిల్లుతోపాటు 5 వేల డాలర్లు అదనంగా కనిపించాయి. ఒకవేళ వారు మర్చిపోయారేమో అని  వారి కోసం చూసింది. కానీ వారు అప్పటికే వెళ్లిపోయారు. వారు ఆ డబ్బుని టిప్పుగా ఇచ్చారని అర్థమైంది. ఈవిషయం తన యజమానికి చెప్పగా.. యజమాని ధన్యవాదాలు చెబుతూ.. బిల్‌ పేపర్‌ను ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశారు. ఇంత మొత్తంలో టిప్పు అందుకున్న జియానా ఆనందానికి హద్దుల్లేవు. ఆ డబ్బు సొంత ఖర్చులకు వాడను. ఏదైనా మంచి పనికోసం వినియోగిస్తాను అని జియానా తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్టు సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతోంది.

ఇదీ చదవండీ..

తుమ్ము ఆపుకొంటున్నారా?


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని