‘న్యూ ఇయర్‌’.. హైదరాబాద్‌లో ఆంక్షలు

తాజా వార్తలు

Updated : 31/12/2020 12:09 IST

‘న్యూ ఇయర్‌’.. హైదరాబాద్‌లో ఆంక్షలు

హైదరాబాద్‌: నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా హైదరాబాద్‌లో‌ పోలీసులు ఆంక్షలు విధించారు. సైబరాబాద్, హైదరాబాద్‌ కమిషనరేట్ల‌ పరిధిలో ఆంక్షలు అమలవుతాయని అధికారవర్గాలు వెల్లడించాయి. రేపు ఉదయం 11 గంటల నుంచి జనవరి 1 ఉదయం 5 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని సైబరాబాద్‌ కమిషనర్‌ కార్యాలయం ప్రకటించింది. సైబర్‌ టవర్స్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, జేఎన్‌టీయూ, మైండ్‌ స్పేస్‌ ఫ్లై ఓవర్స్‌, దుర్గం చెరువు తీగల వంతెన మూసివేస్తున్నట్లు తెలిపింది. ఓఆర్‌ఆర్‌, పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై కార్లు, జీపులకు అనుమతి లేదని స్పష్టం చేసింది.

మరోవైపు హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని ట్యాంక్‌ బండ్‌, ఎన్టీఆర్ మార్గ్‌, నెక్టెస్‌ రోడ్డు మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉండనున్నట్లు అధికారులు వెల్లడించారు. రేపు రాత్రి 10 గంటల నుంచి జనవరి 1 ఉదయం వరకు వాహనాల రాకపోకలను నిషేధించినట్లు తెలిపారు. ఈ మేరకు నెక్లెస్‌ రోడ్డు, ఎన్టీఆర్‌ మార్క్‌, బీఆర్‌కే భవన్‌, తెలుగుతల్లి కూడలి, లిబర్టీ జంక్షన్‌, నల్లగుట్ట రైల్వే వద్ద వాహనాలను దారి మళ్లించనున్నట్లు పేర్కొన్నారు. తాజా ఆంక్షల నేపథ్యంలో బేగంపేట ఫ్లైఓవర్ మినహా నగర వ్యాప్తంగా ఉన్న అన్ని ఫ్లైఓవర్లు రేపు రాత్రి నుంచి జనవరి 1 ఉదయం వరకు మూసివేస్తున్నారు. ఈ మేరకు ప్రజలు అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇంటి వద్దే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి..

ఆ భయం నేరస్థుల్లో కలిగించాం.. 

వెలుగులోకి కొత్తరకం మోసంTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని