కరోనా కల్లోలం.. దిల్లీలో మరో 66మంది మృతి

తాజా వార్తలు

Updated : 05/11/2020 22:25 IST

కరోనా కల్లోలం.. దిల్లీలో మరో 66మంది మృతి

నాలుగు నెలల తర్వాత ఇదే అధికం 

దిల్లీ: దేశ రాజధాని నగరంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. దిల్లీలో వరుసగా మూడోరోజూ 6వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. అలాగే, దాదాపు నాలుగు నెలల తర్వాత తొలిసారి 66 మరణాలు సంభవించడం కలవరానికి గురిచేస్తోంది. గడిచిన 24 గంటల్లో 52,294 మందికి కొవిడ్‌ పరీక్షలు చేయగా.. వారిలో 6,715 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,16,653కి పెరిగినట్టు వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. తాజాగా నమోదైన వాటితో కలిపి ఇప్పటివరకు కొవిడ్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 6,769కి చేరింది. దిల్లీలో ప్రస్తుతం 38,729 క్రియాశీల కేసులు ఉన్నాయి. దిల్లీలో పాజిటివిటీ రేటు 12.84%గా ఉంది. పండుగ సీజన్‌కు వాయు కాలుష్యం తోడవ్వడంతో కేసులు పెరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. 

దిల్లీలో అత్యధికంగా నిన్న ఒక్కరోజే 6,842 కొత్త కేసులు నమోదైన విషయం తెలిసిందే. గత ఆదివారం వరకు రోజూ 5వేలుగా నమోదవుతూ వచ్చిన కొత్త కేసుల సంఖ్య సోమవారం నాటికి తగ్గింది. సోమవారం 4,001 పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదయ్యాయి. అయితే, మంగళవారం 6,725, బుధవారం 6,842 చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక మరణాల విషయానికి వస్తే.. ఆదివారం 51 మంది ప్రాణాలు కోల్పోగా.. సోమవారం 42, మంగళవారం 48 మంది, బుధవారం 51 మంది చొప్పున ప్రాణాలు కోల్పోయారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని