సచివాలయం కూల్చివేత మళ్లీ ప్రారంభం

తాజా వార్తలు

Published : 17/07/2020 17:14 IST

సచివాలయం కూల్చివేత మళ్లీ ప్రారంభం

హైదరాబాద్‌: తెలంగాణ సచివాలయ భవనం కూల్చివేత పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. కూల్చివేతకు హైకోర్టు అనుమతిచ్చిన గంటల వ్యవధిలోనే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. సచివాలయ భవనాల కూల్చివేతకు పర్యావరణ అనుమతులు అక్కర్లేదని కేంద్రం వివరణ ఇవ్వడంతో.. కూల్చివేతకు  వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.

కూల్చివేత పనులు నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ జనసమితి ఉపాధ్యక్షుడు పి.ఎల్‌.విశ్వేశ్వరరావు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు సుదాకర్‌ గతంలో  హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గత వారం రోజులుగా సుదీర్ఘంగా విచారించిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది.

మరోవైపు సచివాలయం కూల్చివేతకు ముందస్తు పర్యావరణ అనుమతి తీసుకోలేదని గతంలో విచారణ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై అడ్వొకేట్‌ జనరల్‌ ప్రసాద్‌ స్పందిస్తూ... కూల్చివేత సమయంలో పర్యావరణ అనుమతి అవసరం లేదని, జీహెచ్‌ఎంసీ అనుమతి తీసుకున్నామని తెలిపారు. నిర్మాణానికి భూమిని సిద్ధం చేసేందుకు పర్యావరణ అనుమతి అవసరమని, కూల్చివేతలు.. నిర్మాణానికి భూమిని సిద్ధం చేయడానికేనని హైకోర్టు అభిప్రాయపడింది. దీనిపై కేంద్ర పర్యవరణ మంత్రిత్వ శాఖను వివరణ కోరింది. తాజాగా కూల్చివేతకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని కేంద్రం చెప్పడంతో పిటిషన్‌ను రద్దు చేస్తూ..సచివాలయ నిర్మాణాల కూల్చివేతకు మార్గం సుగమం చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని