ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి అచ్చెన్నాయుడు తరలింపు

తాజా వార్తలు

Updated : 22/08/2020 22:17 IST

ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి అచ్చెన్నాయుడు తరలింపు

గుంటూరు: ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించారు. అనారోగ్యం కారణంగా ఇప్పటి వరకూ ఆయన రమేశ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఇటీవల అచ్చెన్నాయుడుకు కరోనా సోకడంతో కొవిడ్‌ ఆస్పత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయన్ను ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించారు. అక్కడి కరోనా వార్డులో 26వ గదిని అచ్చెన్నాయుడికి కేటాయించారు. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందించనున్నారు. అచ్చెన్నాయుడు ఉన్న గది వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని